సిసలైన సంక్రాంతి హీరో

Thursday,January 19,2017 - 12:30 by Z_CLU

శతమానం భవతి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిన శర్వానంద్, సిసలైన సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ‘రన్ రాజా రన్’ సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ ఈసారి శతమానం భవతితో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా శర్వానంద్ ఫ్యాన్సే అనిపించుకున్నాడు.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో పాటు, ప్రకాష్ రాజ్, జయసుధ న్యాచురల్ పర్ఫామెన్సెస్ తో ఎట్రాక్ట్ చేస్తే, మిక్కీ జె. మేయర్ పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. వాటికి తోడు డైరెక్టర్ సతీష్ వేగేశ్న పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసిన స్క్రీన్ ప్లే, ఏ మాత్రం కాంప్రమైజ్ కాని ప్రొడక్షన్ వ్యాల్యూస్, పెద్దగా కష్టపడకుండానే సినిమాని సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టేశాయి.

డొమెస్టిక్ సెక్టార్ లోనే కాకుండా ఓవర్ సీస్ లోను శర్వానంద్ కి మార్కెట్ క్రియేట్ చేసిన శతమానం భవతి, రిలీజ్ అయి వారం కావస్తున్నా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం వెయిట్ తగ్గకుండా వసూలు చేస్తూనే ఉంది.