జీ సినిమాలు ( జనవరి 16th)

Sunday,January 15,2017 - 10:00 by Z_CLU

jeevana-tarangalu-zee-cinemalu

నటీ నటులు : శోభన్ బాబు, కృష్ణం రాజు, వాణి శ్రీ
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, అంజలీ దేవి, లక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వర రావు
మ్యూజిక్ డైరెక్టర్ : జె. వి. రాఘవులు
డైరెక్టర్ : తాతినేని రామారావు
ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు
రిలీజ్ డేట్ : 1973

యద్దన పూడి సులోచనా రాణి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం జీవన తరగాలు. 1973 లో రిలీజ్ అయి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తరవాత ఈ సినిమాని హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఈ సినిమాని మూవీ మొఘల్ రామానాయుడు గారు తెరకెక్కించారు.

============================================================================

mangalya-balam-zee-cinemalu

నటీ నటులుశోభన్ బాబు , జయసుధ, రాధిక

ఇతర నటీనటులు : గుమ్మడి, ప్రభాకర రెడ్డి, అంజలీ దేవి, అత్తిలి లక్ష్మి, గొల్లపూడి మారుతి రావు, గిరిబాబు, నూతన్ ప్రసాద్, కాంతారావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : బోయిన సుబ్బారావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

శోభన్ బాబు, జయసుధ, రాధిక కాంబినేషన్ లో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మాంగళ్యబలం. పెళ్ళికి ప్రేమకి మధ్య జరిగే సంఘర్షనే మాంగళ్య బలం. ఇమోషనల్ సీన్స్ ఈ సినిమాకి హైలెట్.

============================================================================

ramudu_bheemudu-zee-cinemalu

నటీ నటులు : N.T.రామారావు, జమున

ఇతర నటీనటులు : S.V. రంగారావు, గిరిజ, రేలంగి, రమణ రెడ్డి, సూర్య కాంతం, రాజనాల, L. విజయ లక్ష్మి

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల నాగేశ్వర రావు

డైరెక్టర్ : తాపీ చాణక్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 21 మే 1964

 నందమూరి తారక రామారావు గారి కరియర్ లో ఆయన టచ్ చేయని జోనర్ లేదు. కామెడీ జోనర్ లో తెరకెక్కిన ‘రాముడు- భీముడు’ ఆల్ టైం హిట్. ఈ సినిమాని ఇప్పుడు చూసినా అంతే ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్. రొటీన్ లైఫ్ లో బోర్ అయిపోయి చూడటానికి ఒకేలా ఉండే రాముడు భీముడు ఒకరి స్థానంలో ఒకరు రావడంతో, మంచి కామెడీ జెనెరేట్ అవుతుంది. డ్యూయల్ రోల్ లో నటించిన NTR పర్ఫామెన్స్ హైలెట్.

=============================================================================

lakshmi-putrudu-zee-cinemalu

నటీ నటులు : ఉదయ్ కిరణ్, దివ్య

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముమైత్ ఖాన్, నిగళ్ గళ్ రవి, సత్య రాజ్, రఘుబాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. లక్ష్మణ్

డైరెక్టర్ : రాజ్ కపూర్

ప్రొడ్యూసర్ : పొలిశెట్టి రామ్ బాబు

రిలీజ్ డేట్ : 29 ఫిబ్రవరి 2008

ఉదయ కిరణ్ చేసిన సినిమాల్లో ప్రేమ కథలే ఎక్కువ. లవర్ బాయ్ ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న టైం లో ఫాదర్ సెంటిమెంట్ తో చేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ లక్ష్మీ పుత్రుడు. మతి స్థిమితం తప్పిన తన తండ్రి కోసం, హీరో ఏం చేశాడన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

srimahalakshmi-zee-cinemalu

నటీనటులు : శ్రీహరి, సుహాసిని

ఇతర నటీనటులు : షామ్న, సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఫైట్ మాస్టర్ విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ యాక్షన్  థ్రిల్లర్ గా నిలిచింది శ్రీ మహాలక్ష్మి. శ్రీహరి లాయర్ గా నటించిన ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ విజయన్ డైరెక్టర్. ఆద్యంతం కట్టి పడేసే సస్పెన్స్ ఈ సినిమాలో హైలెట్.

==============================================================================

 

yuganiki-okkadu-zee-cinemalu

నటీ నటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రం ‘యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓ అమ్మాయి ఓ ఇద్దరి సహాయం తో ఆ స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకి ప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రం లో కార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.

==============================================================================

enadu-zee-cinemalu

నటీ నటులు : కమల హాసన్, వెంకటేష్

ఇతర నటీనటులు : గణేష్ వెంకటరామన్, Dr.భారతీ రెడ్డి, సంతాన భారతి, శ్రీమాన్, ప్రేమ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శృతి హాసన్

డైరెక్షన్ : చక్రి తోలేటి

ప్రొడ్యూసర్ : కమల హాసన్

రిలీజ్ డేట్ : 19 సెప్టెంబర్ 2016

కమల్ హాసన్, వెంకటేష్ నటించిన నటించిన ఈనాడు సినిమా ఏ నటుడైనా చేసి తీరాలి అనుకున్న స్టోరీ, ప్రేక్షకులు చూసి తీరాలి అనుకునే సినిమా. సరికొత్త కథనంతో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కిందే ఈనాడు. ఇందులో కమల హాసన్ యాక్టింగ్ హైలెట్.