'శతమానం భవతి' ఎట్రాక్షన్స్

Thursday,January 12,2017 - 09:00 by Z_CLU

చూస్తూ చూస్తూ సంక్రాంతి సందడి రానే వచ్చేసింది… కానీ ఈ సారి సంక్రాంతి మరో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఆడ్ అయింది. ఎప్పటిలాగే కొత్త బట్టలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు.. వాటితో పాటు థియేటర్స్ లో శతమానం భవతి… ఈ సినిమా క్రియేట్ చేస్తున్న ప్లెజెంట్ వైబ్రేషన్స్ చూస్తుంటే సంక్రాంతి వస్తూ వస్తూ సరికొత్త వైభోగాన్ని వెంట తెచ్చుకుందా… అనిపిస్తుంది. ఈసారి సంక్రాంతికి రిలీజ్ కి రెడీగా ఉన్న ‘శతమానంభవతి’ సినిమాలో కొన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్ చూద్దాం.

shatamanam-1

శతమానం భవతి ట్రయిలర్ చూస్తే సంక్రాంతి స్పెషల్ మూవీగా ఎందుకు నిలిచిందో అర్థమైపోతుంది. నిండుగా, కంటికి ఇంపుగా.. చూసిన కొద్దీ హాయిగా అనిపించే అందమైన ఫ్యామిలీ… ఎంతమందితో కలిసి సినిమాకి వెళ్ళినా.. ఒక్కో క్యారెక్టర్ లో మనల్ని మనం చూసుకుని మురిసిపోవచ్చు.

shatamanam-2

పచ్చటి పల్లెటూళ్ళే సంక్రాంతి పండక్కి బ్రాండ్ అంబాసిడర్లు… అలాగని అందరికీ పల్లెటూళ్ళలో ఫెస్టివల్ సెలెబ్రేట్ చేసుకునే చాన్స్ ఎక్కడ దొరుకుతుంది.. కానీ శతమానం భవతి సినిమా చూస్తున్నంత సేపు ఆ పచ్చటి పంటపొలాల్లో విహరిస్తున్న అనుభూతి కలగక మానదు.

shatamanam-3

ఇక ఎట్రాక్షన్ 2 అంటే సినిమాలో అనవసరంగానే ఊడిపడే హడావిడి లేకపోవడమే… ఇంకో లాంగ్వేజ్ లో చెప్పాలంటే భీభత్సమైన కమర్షియల్ ఎలిమెంట్స్… కావాలని ఇరికించే ఐటం సాంగ్స్… గడగడలాడించే యాక్షన్ సీక్వెన్సెస్… వీటికి దూరంగా మన ఇంటి కథ అనిపించేలా ఉండడమే శతమానంభవతి గొప్పదనం. తెలుగు ఇళ్లల్లో ఉంటే సాధారణ సన్నివేశాలు, చిలిపి అల్లర్లు ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. ఫ్యామిలీస్ కు కనెక్ట్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్. సో… కూల్ అండ్ ప్లెజెంట్ గా సాగిపోయే న్యాచురల్ క్యారెక్టర్సే  ఈ సినిమాకి సెకండ్ ఎట్రాక్షన్…

shatamanam-4

గ్రేస్ ఫుల్ రొమాన్స్… శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇప్పటికీ యూత్ ని ఎట్రాక్ట్ చేసేసింది… స్టోరీలో ఇంటర్నల్ గా నడిచే ఈ లవ్ ట్రాక్.. సినిమాలో మరో ఎట్రాక్షన్ కానుంది.

shatamanam-5

మిక్కీ జె. మేయర్ మ్యూజికల్ మేజిక్ మరో ఎట్రాక్షన్. తెలుగుదనం ఉట్టిపడే స్వరాలతో పండగను ఆహ్వానించేలా ట్యూన్ అయిన పాటలు, పచ్చటి లోకేషన్స్ లో ఎలా తెరకెక్కాయో స్క్రీన్ పై చూసి తరించాల్సిందే… ఇప్పటికే మ్యూజికల్ హిట్ అని కాంప్లిమెంట్స్ అందుకుంటున్న శతమానం భవతి విజువల్ ట్రీట్ అనిపించుకోవడానికి ఈ సంక్రాంతికి థియేటర్స్ లోకి దూసుకొస్తోంది.

shathamanam-bhavathi-6

ప్రకాష్ రాజ్, జయసుధ కాంబినేషన్ ఇప్పటికే సూపర్ హిట్. వీళ్లిద్దరూ కలిసి నటిస్తే సినిమాకు ఆ కాంబినేషనే బ్యాక్ బోన్ అవుతుంది. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది.  పైగా ఇద్దరూ సహజనటులు. శతమానంభవతి సినిమాకు ఇది కూడా మరో పెద్ద ఎట్రాక్షన్.

shatamanam-7

నిర్మాత దిల్ రాజుకు ఫ్యామిలీ మూవీస్ స్పెషలిస్ట్ అనే ట్యాగ్ లైన్ ఉండనే ఉంది. అందర్నీ కట్టిపడేసేలా ఓ చూడచక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయాలంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో అది దిల్ రాజుకే సాధ్యం. అలాంటి అభిరుచి కలిగిన నిర్మాత నుంచి వస్తున్న మరో సకుటుంబ సపరివారసమేత చిత్రం శతమానంభవతి.