శర్వానంద్ అప్ కమింగ్ మూవీస్

Monday,July 31,2017 - 10:00 by Z_CLU

ఇటీవలే సంక్రాంతి బరిలో ‘శతమానం భవతి’ సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న శర్వానంద్ ప్రెజెంట్ మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ సినిమాతో సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్స్ట్ పై ఓ క్లారిటీ కొచ్చేసాడట శర్వా. ఇప్పటికే సుధీర్ వర్మ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటున్న శర్వా మరో వైపు ప్రకాష్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట.


మారుతి డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘మహానుభావుడు’ సినిమాను ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజికి తీసుకొచ్చేసిన శర్వా ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాతో థియేటర్స్ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుకుంటున్న ఈ సినిమాలో శర్వా సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది.


కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న శర్వా నంద్ ‘మహానుభావుడు’ సినిమా పూర్తవ్వగానే సుధీర్ వర్మ డైరెక్షన్ ఓ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట శర్వా. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కంఫర్మ్ అయిందని, త్వరలోనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.


సుధీర్ వర్మ తో పాటే రాఘ వేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడట శర్వా. ఇప్పటికే ప్రకాష్ శర్వా కి ఓ అదిరిపోయే పాయింట్ వినిపించాడని ఈ పాయింట్ విని శర్వా ఇంప్రెస్స్ అయ్యాడని త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని టాక్. సో ఈ రెండు సినిమాలతో ప్రెజెంట్ తన డైరీని ఫిల్ చేసుకున్న శర్వా ఈ సినిమాల తర్వాతే మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడని సమాచారం.