ఆగస్ట్ 15న 'రాజా ది గ్రేట్' టీజర్

Monday,July 31,2017 - 11:14 by Z_CLU

రవితేజ హీరోగా నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘రాజా ది గ్రేట్’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం, రవితేజ ఇందులో అంధుడిగా కనిపించబోతున్నాడు. అందుకే దీన్ని ఎక్స్ పెరిమెంటల్ ఎఁటర్ టైనర్ అంటున్నారు. ఈ సినిమా టీజర్ ను ఆగస్ట్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. 30శాతం మినహా దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రఘుబాబు, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం రవితేజ 2 సినిమాలు చేస్తున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ అనే సినిమా చేస్తూనే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీ చేస్తున్నాడు. ‘రాజా ది గ్రేట్’ మూవీని అక్టోబర్ 12న విడుదల చేయాలని అనుకుంటున్నారు.