జీ సినిమాలు ( 31st జూలై)

Sunday,July 30,2017 - 11:51 by Z_CLU

తాజ్ మహల్

నటీనటులు : శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి

ఇతర నటీనటులు : శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : ముప్పలనేని శివ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 25 మే 1995

శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తాజ్ మహల్. శ్రీకాంత్ ని లవర్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై లవర్ బాయ్ గా ఎస్టాబ్లిష్ చేసిన  సినిమా ఇది. శ్రీకాంత్ సరసన మోనికా బేడీ, సంఘవి నటించారు. M.M. శ్రీలేఖ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

నాయుడు గారి కుటుంబం

నటీనటులు: సుమన్, సంఘవి, కృష్ణంరాజు

ఇతర నటీనటులు : శివ కృష్ణ, శ్రీహరి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : బోయిన సుబ్బారావు

ప్రొడ్యూసర్ : డి . రామానాయుడు

రిలీజ్ డేట్ : 1996

సుమన్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం అందంగా తెరకెక్కిన చిత్రం నాయుడు గారి కుటుంబం. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారు. కోటి అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ.

==============================================================================

 

స్ట్రాబెర్రీ

నటీనటులు : పా. విజయ్ , అవని మోడీ

ఇతర నటీనటులు :  సముథిరఖని , యువీని పార్వతి, వేత్రి, దేవయాని, కవితాలయ కృష్ణన్ తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ : తాజ్ నూర్

డైరెక్టర్ : పా.విజయ్

ప్రొడ్యూసర్ : పా.విజయ్

రిలీజ్ డేట్ : 11 సెప్టెంబర్  2015

 పా. విజయ్ హీరోగా స్వీయ దర్శకత్వం లో  తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్  ‘స్ట్రాబెరి’. ఈ సినిమాలో హారర్ కామెడీ , రొమాంటిక్ సీన్స్, తాజ్ నూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అలరిస్తాయి. ఆధ్యంతం ఉతకంత భరితమైన స్క్రీన్ ప్లే సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ ప్రతి క్షణం థ్రిల్ కలిగిస్తుంది. ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకూ భయపెట్టే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్.

==============================================================================

టక్కరి

నటీనటులు : నితిన్, సదా

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్

ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్

రిలీజ్ డేట్ : 23 నవంబర్ 2007

ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.

==============================================================================

ఆదివిష్ణు

హీరోహీరోయిన్లు – దాసరి అరుణ్, స్నేహ

ఇతర నటీనటులు – ఐశ్వర్య, కోటశ్రీనివాసరావు,  ప్రదీప్ రావత్, సుమన్, వేణుమాధవ్, అలీ, ఎమ్మెస్ నారాయణ

సంగీతం – ఎం.ఎం. శ్రీలేఖ

దర్శకత్వం – భరత్ పారేపల్లి

విడుదల తేదీ – 2008, ఆగస్ట్ 21

అప్పటికే హీరోగా మారిన దాసరి అరుణ్ కుమార్ చేసిన మరో ప్రయత్నమే ఆదివిష్ణు. అప్పుడప్పుడే టాలీవుడ్  లో పేరుతెచ్చుకుంటున్న స్నేహ ఈ సినిమాలో అరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు, సుమన్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటించడం ఒక  స్పెషల్ అయితే… ఎమ్మెస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్ పండించిన కామెడీ సినిమాకు మరో ఎట్రాక్షన్.

==============================================================================

భయ్యా  

నటీ నటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.

==============================================================================

 

నకిలీ

నటీనటులు : విజయ్ అంటోని, సిద్ధార్థ్ వేణు గోపాల్

ఇతర నటీనటులు : రూప మంజరి, అనుయ భగవత్, విజయ్, విభ నటరాజన్, కృష్ణమూర్తి, ప్రమోద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ అంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ అంటోని

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2012

విజయ్ అంటోని హీరోగా జీవ శంకర్ డైరేక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నకిలీ. చిన్నప్పుడే తల్లిని చంపిన హత్యా నేరంలో జైలు కెళ్ళిన కుర్రాడు, జైలునుండి బయటికి వచ్చి ఏం చేశాడు..? అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ప్రధాన కథాంశం.