Sharwanand Engaged To Rakshita
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరు యంగ్ హీరో శర్వానంద్. ఇప్పుడీ హీరో తన బ్యాచిలర్‌హుడ్‌ను ముగించడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఈరోజు శర్వా ఎంగేజ్ మెంట్ పూర్తయింది. (Sharwanand Engagement) శర్వానంద్ కాబోయే భార్య పేరు రక్షితా రెడ్డి.

మైనేని వసుంధరా దేవి, మైనేని రత్నగిరి వర ప్రసాదరావుల కుమారుడు శర్వానంద్. టెక్కీ అయిన రక్షితను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు. హైకోర్టు న్యాయవాది పసునూరు మధుసూధన్ రెడ్డి, పసునూరు సుధా రెడ్డిల కుమార్తె రక్షిత.

ఈరోజు శర్వానంద్, రక్షిత (Sharwanand Rakshita Reddy) నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకుంది. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, నాగార్జున కుటుంబం, రామ్ చరణ్, ఉపాసన, అఖిల్, నాని, రానా దగ్గుబాటి, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, నితిన్, శ్రీకాంత్, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవి, సితార నాగవంశీ, నిర్మాత చినబాబు, దర్శకుడు క్రిష్, సుధీర్ వర్మ, చందూ మొండేటి, వెంకీ అట్లూరి, అభిషేక్ అగర్వాల్, సుప్రియ, స్వప్న దత్, ఏషియన్ సునీల్, సుధాకర్ చెరుకూరి, దేవా కట్టా, నిర్మాతలు వంశీ, విక్రమ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
