కాన్సంట్రేషన్ మొత్తం శర్వానంద్ పైనే...

Wednesday,July 25,2018 - 12:37 by Z_CLU

క్యారెక్టర్ లో హీరోయిజం డోస్ తగ్గినా పర్వాలేదు కానీ, సినిమా మాత్రం డిఫెరెంట్ గానే ఉండాలనేది శర్వానంద్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే రూల్. అందుకే శర్వా సినిమా సెట్స్ పై ఉందంటే మినిమం ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ అని ఫిక్సవుతారు ఫ్యాన్స్. అందుకే హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘పడి పడి లేచే మనసు’ సినిమాపై రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూనే ఉంది.

ఈ సినిమాని డిసెంబర్ 21 న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఫిల్మ్ మేకర్స్. అయితే సందర్భానుసారంగా ఈ సినిమా పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమా స్టోరీలైన్ విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాలో శర్వా క్యారెక్టర్ చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.

ఇప్పటికే రిలీజైన పోస్టర్ లలో లైట్ గెడ్డంతో పాటు ఉంగరాల జుట్టుతో కనిపిస్తున్న శర్వానంద్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఈ టాపిక్ పై సోషల్ మీడియాలో డిఫెరెంట్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నా, అట్లీస్ట్ ఈ సినిమా టీజర్ రిలీజైతే కానీ ఈ విషయంలో కంక్లూజన్ కి రావడం కష్టం.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్  బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.