పెళ్లి పుకార్ల లిస్ట్ లో చేరిన మరో హీరోయిన్

Wednesday,July 25,2018 - 11:51 by Z_CLU

అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది? కాజల్ పెళ్లికి సంబంధించి అప్ డేట్ ఏంటి? త్రిష పెళ్లి కబుర్లు ఎక్కడివరకు వచ్చాయి. నయనతార తన బాయ్ ఫ్రెండ్ తో మూడు ముళ్లు ఎప్పుడు వేయించుకుంటుంది? పెళ్లికి సంబంధించి మొన్నటివరకు రూమర్లలో నలిగిన హీరోయిన్లు వీళ్లు మాత్రమే. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా తమన్న కూడా చేరిపోయింది.

28 ఏళ్ల మిల్కీబ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందనే పుకారు ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ను తమన్న పెళ్లి చేసుకోనుందట. కేవలం డాక్టర్ ప్రొఫెషన్ మాత్రమే కాకుండా, అతడికి అమెరికాలో కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయట.

మొన్నటివరకు సోషల్ మీడియాకు మాత్రమే స్టిక్ అయిన ఈ రూమర్, ఇవాళ న్యూస్ పేపర్స్ లో కూడా కనిపించింది. ఇది కేవలం పుకారు మాత్రమే కాదంటూ చాలా పత్రికలు ఆర్టికల్స్ రాశాయి. మరి ఈ పెళ్లి పుకారులో ఎంత నిజముందో తెలియాలంటే, తమన్న రియాక్ట్ అవ్వాల్సిందే.