హనూ రాఘవపూడి ఇంటర్వ్యూ

Thursday,December 20,2018 - 04:43 by Z_CLU

ఏ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసిన హనూ రాఘవపూడి సినిమాలో లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఈ సారి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీతో, ‘పడిపడి లేచే మనసు’ తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడాడు. అవి మీకోసం.

బెస్ట్ కాంప్లిమెంట్…

అందరూ నన్ను మణిరత్నం తో, సుకుమార్ తో కంపేర్ చేస్తుంటే హ్యాప్పీగా అనిపిస్తుంది. నా దృష్టిలో అది బెస్ట్ కాంప్లిమెంట్. ఒక సినిమా గురించి మాట్లాడేటప్పుడు అది ఏ తరహా సినిమా అనేది అర్థమయ్యేలా చెప్పడానికి అలా కంపేర్ చేస్తుంటారు.

అదొక్కటే సమస్య కాదు…

‘పడిపడి లేచే మనసు’ సినిమాలో బ్రేకప్ ఒక్కటే ప్రాబ్లమ్ కాదు. ఇంకా ఇతరత్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి వల్ల బ్రేకప్ ఉంటుంది. టైటిల్ లో లాగే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.

నా స్టైల్ లో…

ఇదేదో కొత్త లవ్ స్టోరీ అని చెప్పను. కానీ ఒక్కో సిచ్యువేషన్ ని ఒక్కొక్కరు ఒక్కోలా డీల్ చేస్తుంటారు. నేను ఈ సినిమాని, సిచ్యువేషన్స్ ని నా స్టైల్ లో డీల్ చేశాను.

ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్…

సాయి పల్లవి ఈ కథకి ఫస్ట్ స్ట్రయిక్ అయిన ఆప్షన్. అప్పటి నుండే తనే. ఇంకో ఆలోచన రాలేదు.

నా లైఫ్ లో లవ్ లేదు…

నా లైఫ్ లో లేదు కాబట్టే ఇలా ఉంటే బావుంటుందనే ఇమాజినేషన్స్ ఉంటాయి. లవ్ స్టోరీస్ రాయడానికి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు.

క్యారెక్టర్ కి ‘సూర్య’ నే కరెక్ట్…

సినిమాలో హీరో క్యారెక్టర్ కి చాలా స్ట్రగుల్ ఉంది. దానికి తోడు చాలా సిచ్యువేషన్స్ లో ఆ పేరే కరెక్ట్ అనిపిస్తుంది.

J.K. తో జర్నీ…

సినిమాటోగ్రాఫర్ J.K. నాకు చాల రోజులుగా పరిచయం. 2006 లో మేమిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాం. ఆ తరవాత మళ్ళీ కలిసి చేయకపోయినా, ఈ సినిమా వరకు తనే కరెక్ట్ అనుకున్నాం.

ఆ కోరిక తీరింది…

2007 ఆ టైమ్ లో కొన్ని రోజులు కోల్ కతా లో ఉన్నాను. అప్పటి నుండి ఏదోలా అక్కడ సినిమా చేయాలనే కోరిక బలపడింది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. నాకు కోల్ కతాలో ప్రతి కార్నర్ తెలుసు.

సినిమాకి అది ప్లస్ అయింది…

కథ రాసుకునేటప్పుడు పర్టికులర్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారనే క్లారిటీ లేకపోతే, శూన్యంలో రాసుకున్నట్టే అవుతుంది. ఈ క్యారెక్టర్ కి శర్వానంద్ అని కన్ఫమ్ అయ్యాక రాసుకున్నా కాబట్టి, చాలా లిబర్టీ దొరికింది. శర్వానంద్ పర్ఫామెన్స్ ఎబిలిటీస్ అవుట్ స్టాండింగ్ కాబట్టి క్యారెక్టర్ ని ఇంకా ఎలివేట్ చేసే అవకాశం దొరికింది.

గ్రౌండ్ రియాలిటీస్…

సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. సినిమాలో సునీల్ ప్లే చేసిన క్యారెక్టర్ నవ్వించినా, కావాలని తెచ్చి పెట్టుకున్న కామెడీ ఉండదు. స్క్రీన్ ప్లే ని బట్టి న్యాచురల్ గా ఉండే ఫన్ ఉంటుంది.