వీకెండ్ రిలీజెస్

Wednesday,July 25,2018 - 02:21 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన 4 సినిమాలు ‘లవర్’, ‘ఆటగదరా శివ’  ‘w/o రామ్’, ‘పరిచయం’ దేనికదే స్పెషల్ అనిపించుకుంటున్నాయి. లవర్, పరిచయం సినిమాలు యూత్ ని టార్గెట్ చేస్తే మంచు లక్ష్మీ ప్రసన్న ‘W/O రామ్’ డిఫెరెంట్ సినిమా అనిపించుకుంది. ఇక ఇదే వరసలో రిలీజైన ‘ఆటగదరా శివ’ కమర్షియల్ గా ఏ స్థాయిలో నిలబడింది పక్కన పెడితే, క్రిటిక్స్ చేత కూడా సూపర్ అనిపించుకుంది.

ఇక నెక్స్ట్ వీక్ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు బాక్సాఫీస్ బరికి ఆల్ సెట్ మోడ్ లో ఉన్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో ఈ సినిమాల చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, ఈ వీకెండ్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఈ వీకెండ్ రిలీజవుతున్న సినిమా వివరాలు…

సాక్ష్యం : ఈ వీకెండ్ రిలీజవుతున్న సినిమాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. ఏ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27 న గ్రాండ్ గా రిలీజవుతుంది.

మోహిని : త్రిష కరియర్ లోనే ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా మోహిని. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ‘త్రిష’ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేస్తుంది. మోస్ట్ ఇంటెన్సివ్ హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27 న రిలీజవుతుంది.

పెదవి దాటని మాటొకటుంది : రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో యూత్ లో క్యూరాసిటీ జెనెరేట్ చేయడానికి ట్రై చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ నెల 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ అయితే రివీల్ కాలేదు కానీ, కంప్లీట్ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో యూత్ ని ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి…

హ్యాపీ వెడ్డింగ్ : నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ హ్యాపీ వెడ్డింగ్. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సూపర్ హిట్టవ్వడంతో ఈ సినిమా చుట్టూ యూత్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 28 న రిలీజ్ అవుతుంది.

ఈ సినిమాలతో పాటు   హాలీవుడ్ ఎంటర్ టైనర్ ‘మిషన్ ఇంపాసిబుల్’ కూడా జూలై 27 న రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే టామ్ క్రూస్ ఫ్యాన్స్ లో ఈ సినిమా కోసం కౌంట్ డౌన్ బిగిన్ అయింది. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ సని క్రియేట్ చేసుకున్న ఈ సక్సెస్ ఫుల్ సిరీస్, ఈ సారి ఏ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా క్రిస్టఫర్ మెక్ క్విన్ డైరెక్షన్ లో తెరకెక్కింది.