‘పడిపడి లేచే మనసు’ టైటిల్ సాంగ్ రిలీజయింది

Monday,November 12,2018 - 04:31 by Z_CLU

యూత్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘పడి పడి లేచే మనసు’. శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజయింది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ట్యూన్స్ తో పాటు, ఈ వీడియోలో ఉన్న కలర్ ఫుల్ స్టిల్స్, ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

‘పదపద పదమని పెదవులిలా పరుగెడితే…’ అంటూ బిగిన్ అయ్యే లిరిక్స్ సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటున్నాయి. కృష్ణకాంత్ ఈ సాంగ్ కి లిరిక్స్ రాశాడు. అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ కలిసి ఈ పాటను పాడారు. సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే ఈ సాంగ్ విజువల్స్ పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది ఈ లిరికల్ వీడియో.

హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.  డిసెంబర్ 21 న  రిలీజవుతుంది పడి పడి లేచే మనసు.