శర్వానంద్ కి కూడా ఆ విషయం తెలీదు – సాయి పల్లవి

Tuesday,December 18,2018 - 01:27 by Z_CLU

ఈ నెల 21 న రిలీజవుతుంది ‘పడి పడి లేచే మనసు’ సినిమా. ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అయి ఉన్నాయి ఈ సినిమా చుట్టూ. దానికి తోడు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రావడంతో, ఈ వీకెండ్ రిలీజవుతున్న సినిమాల మధ్య, ‘పడి పడి లేచే మనసు’ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. నిన్నటి ఈవెంట్ లో సాయి పల్లవి స్పీచ్ ఫ్యాన్స్ టోటల్ గా మెస్మరైజ్ చేసేసింది.

ఎప్పటి లాగే ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ కి థాంక్స్ చెప్పిన సాయి పల్లవి శర్వానంద్ వరకు వచ్చేసరికి పొగడ్తలతో ముంచెత్తింది. ‘ఇప్పటి వరకు శర్వాతో పని చేసిన స్టార్స్, శర్వా గురించి, చాలా మాట్లాడి ఉంటారు కానీ, ఆయన ఎంత మంచి కో స్టార్ అంటే, ఆ విషయం ఆయనకు కూడా తెలీదు.” అని చెప్పుకుంది సాయి పల్లవి.

ఈ సినిమాలో బెంగాలీ అమ్మాయిలా కనిపించనుంది సాయి పల్లవి. శర్వానంద్ ని కూడా మరీ రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇప్పటికే యూత్ కి తెగ నచ్చేసింది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాత.