శర్వానంద్ ఇంటర్వ్యూ

Wednesday,December 19,2018 - 06:24 by Z_CLU

బ్యాలన్స్డ్ గా కరియర్ ని ప్లాన్ చేసుకున్నాడు శర్వానంద్. ఒక లవ్ స్టోరీ తో ఎంటర్ టైన్ చేస్తాడో లేదో, ఇమ్మీడియట్ గా మాస్ రోల్ లో కనిపించి మెస్మరైజ్ చేస్తాడు. ఓవరాల్ గా శర్వానంద్ కి ఏ క్యారక్టర్ అయినా సూటవ్వడం గ్యారంటీ అనిపించేంతలా డిఫెరెంట్ జోనర్స్ లో నటిస్తూ 100% యాక్టర్ అనిపించుకున్నాడు. ఈ నెల 21 న రిలీజవుతున్న ‘పడి పడి లేచే మనసు’ తో ఆడియెన్స్ కి మరింత దగ్గరవుతానని కాన్ఫిడెంట్ గా ఉన్న శర్వా, మీడియాతో మాట్లాడాడు. ఆ విషయాలు మీకోసం..

అదీ కోల్ కతా బ్యాక్ డ్రాప్…

కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మ్యాగ్జిమం సినిమాలు హిట్ అయ్యాయి. ఖుషి, లక్ష్మి, చూడాలని ఉంది.. ఈ సినిమాలన్నీ హిట్టే. సెంటిమెంటల్ గా ఈ సినిమా కూడా గ్యారంటీగా హిట్టవుతుందనే నా నమ్మకం.

జస్ట్ లవ్ స్టోరీ…

ఇది లవ్ స్టోరీ కాబట్టి, కొత్తగా ఉంటుందని చెప్పడానికి లేదు. కానీ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఉంది కాబట్టి, హౌరా బ్రిడ్జ్, ఇంకా అక్కడి లొకేషన్స్, కల్చర్ అన్నీ కొత్తగా ఉంటాయి. విజువల్ గా యూరోపియన్ స్టైల్ లో కొత్తగా ఉంటుంది.

ఫుట్ బాల్ ప్లేయర్…

సినిమాలో నేను ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ గా కనిపిస్తాను కానీ, దానికి కథకి అస్సలు సంబంధం ఉండదు.

నచ్చిన పాయింట్ అదే…

మీరు ట్రైలర్ లో చూసినట్టు ఎక్కడా ఒక అబ్బాయి, అమ్మాయిని అలా ప్రపోజ్ చేసి ఉండడు. కథ వినగానే నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ అదే. అలా అమ్మాయిని ఎన్నిసార్లు ప్రపోజ్ చేశాడు..? ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య అన్నదే ఈ సినిమా.

హనూ గురించి…

హనూ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. ఆయన్ని ఇండస్ట్రీలో జూనియర్ సుకుమార్, జూనియర్ మణిరత్నం అంటుంటారు. తనకింకా రావాల్సినంత గుర్తింపు రాలేదనే నా ఫీలింగ్…

సినిమాకి అదే హైలెట్…

సాయి పల్లవి, నాకు మధ్య ఉండే కెమిస్ట్రీనే సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. సినిమాలో సాయి పల్లవిని నేను డామినేట్ చేశానా..? నన్ను సాయి పల్లవి డామినేట్ చేసిందా..? లాంటి క్వశ్చన్స్ పక్కన పెడితే, ఇద్దరి మధ్య ఉండే ప్రతి సీన్ న్యాచురల్ గా రీచ్ అవుతుంది.

సినిమాలో సూర్య అంటే…

నా క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. హనూ స్టోరీ చెప్పినప్పుడే చెప్పాడు. సూర్య చాలా స్పాంటినియస్ గా ఉంటాడు. సూర్యుడంత బ్రైట్ గా, ఆక్టివ్ గా ఉంటాడు.

తెలుగు టెక్నీషియన్స్…

మన తెలుగులో చాలా మంది మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళను మనమే గుర్తించడం లేదు. J.K. ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా ఉన్నాడు. ఇంకా తెలుగు టెక్నీషియన్స్ రావాలి. మన సినిమాలు మనమే తీసుకోవాలి.

బన్నికి చాలా థాంక్స్…

బన్ని నాకు చిన్నప్పటి నుండి తెలుసు. మేమందరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేశాడు చాలా హ్యాప్పీ.

నాకెప్పుడూ ఆ ఫీలింగ్ లేదు…

సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి. ఇంత మార్కెట్ మెయిన్ టైన్ చేయాలి లాంటి క్యాలిక్యులేషన్స్ నేనెప్పుడూ పెట్టుకోను. నేను కథను నమ్ముకుంటాను. దానికి 100% డెడికేషన్ తో పని చేస్తాను.

సుధీర్ వర్మతో సినిమా…

సుధీర్ వర్మ తో సినిమా 50% కంప్లీట్ అయింది. ఇంకో షెడ్యూల్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోతుంది. 1980 లో జరిగే స్టోరీ అదీ. నాది డ్యూయల్ రోల్ కాదు సినిమాలో. కానీ ప్రెజెంట్ జెనెరేషన్ స్టోరీ కూడా ఉంటుంది సినిమాలో.

96 రీమేక్…

96 సినిమా చూశాను. ఫాంటాస్టిక్ సినిమా. ఈ రీమేక్ కి సంబంధించి తక్కిన డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేస్తాం.

ప్లానింగ్ ఉండదు కాకపోతే…

‘రన్ రాజా రన్’ తరవాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తరవాత ‘శతమానం భవతి’, ఇప్పుడు ‘పడి పడి లేచే మనసు’ దీని తరవాత గ్యాంగ్ స్టర్ లా,  అలా ఒక జోనర్ తరవాత ఇమ్మీడియట్ గా అదే జోనర్ రిపీట్ కాకుండా చూసుకుంటా అంతే తప్ప, అంతకు మించి కరియర్ కి సంబంధించి ప్లానింగ్ చేసుకోను.

ఆ సినిమా ఆడదు…

పర్టికులర్ గా అవార్డు కోసమే సినిమా చేస్తే, అది అస్సలు ఆడదు. మంచి సినిమా చేస్తే అదే మనల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్తుంది.

నిర్మాత సుధాకర్ గారు…

సుధాకర్ గారు టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. కథకి ఎంత పెట్టాలి అనేది తెలిసిన ప్రొడ్యూసర్. ఆయన ఇండస్ట్రీలో చాలా రోజులు ఉంటారు ఫర్ ష్యూర్.