మరో రెండు సినిమాలతో...

Sunday,March 05,2017 - 11:05 by Z_CLU

ఈ ఏడాది ‘శతమానం భవతి’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వా నంద్ మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘రాధా’ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసిన శర్వా ప్రెజెంట్ మారుతీ దర్శకత్వం లో నటించనున్న ‘మహానుభావుడు’ సినిమాను సెట్స్ పై పెట్టేశాడు…

ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ లో నటించిన ‘రాధా’ సినిమాతో సమ్మర్ లో థియేటర్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్న శర్వా ఇదే ఏడాది ‘మహానుభావుడు’ గా ఎంటర్టైన్ చేయాలనీ చూస్తున్నాడు. మరి శతమానం భవతి సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న శర్వా ఈ రెండు సినిమాలతో ఎలాంటి హిట్ సాదిస్తాడో…చూడాలి.