మహేష్ కోసం బాలీవుడ్ హీరోయిన్....

Sunday,March 05,2017 - 12:08 by Z_CLU

ప్రెజెంట్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ నెక్స్ట్ కొరటాల శివతో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారనే వార్త మొన్నటి వరకూ చక్కర్లు కొట్టగా ఇప్పుడు కీర్తి బదులు మరో బాలీవుడ్ హీరోయిన్ ని సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది..

టాలీవుడ్ లో ఇప్పటికే రెండు వరుస సూపర్ హిట్స్ అందుకొని లక్కీ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం పవన్ సినిమాతో పాటు కోలీవుడ్ లో మరో రెండు మూడు సినిమాకు సైన్ చేసిందట.. ఇక ప్రెజెంట్ కీర్తి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కీర్తి కి బదులు మహేష్ కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ను సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి కొరటాల సినిమాలో సూపర్ స్టార్ సరసన నటించే హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…