నిర్మాతగా ఫోకస్ పెట్టబోతున్న పవన్

Sunday,March 05,2017 - 10:00 by Z_CLU

ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్ ను చివరి దశకు తీసుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో చేయబోయే నెక్స్ట్ సినిమాతో పాటు నిర్మాతగా కూడా ఫోకస్ పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఇటీవలే నిర్మాతగా నితిన్ తో ఓ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన పవన్ ఆ సినిమాతో పాటు మరో సినిమా పై కూడా ఫోకస్ పెడుతున్నాడట.

ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సినిమాను అనౌన్స్ చేసిన పవన్ త్వరలోనే మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కూడా ఓ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడట.. నితిన్ సినిమాను త్రివిక్రమ్ తో కలిసి నిర్మించబోతున్న పవన్ సాయి ధరమ్ హీరోగా తెరకెక్కే సినిమాను బండ్ల గణేష్ తో కలిసి నిర్మించనున్నాడని సమాచారం…