ఆగస్ట్ 10 నుంచి అల్లుడి పాటల హంగామా

Tuesday,August 07,2018 - 11:49 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ శైలజారెడ్డి అల్లుడు హంగామాకు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 10 నుంచి ఈ సినిమా పాటలు సందడి చేయబోతున్నాయి. ఫర్ ఏ ఛేంజ్.. ఏకంగా వీడియో సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. అవును.. ఆడియో సాంగ్ రిలీజ్ చేసే పద్ధతి నుంచి వీడియో సింగిల్ కు మారింది యూనిట్.

శుక్రవారం ఉదయం 10 గంటలకు శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ వీడియో సింగిల్ విడుదల అవుతుంది. ఈ మేరకు సితార ఎంటర్ టైన్ మెంట్స్, డైరక్టర్ మారుతి అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మరో అందమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. ‘అను బేబీ’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను గోపీసుందర్ కంపోజ్ చేశాడు.

నాగచైతన్య-అను ఎమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. సినిమాకు సంబంధించి ఇప్పటికే కీలకమైన 3 పాత్రల్ని టీజర్ లో పరిచయం చేశారు. ఈనెల 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది శైలజారెడ్డి అల్లుడు సినిమా.