నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆడియో రిలీజ్

Monday,August 06,2018 - 06:56 by Z_CLU

నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ హంగామా మరింత స్పీడందుకోనుంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ తో ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ సినిమాపై ఫిక్స్ అయ్యే రేంజ్ లో ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేసిన ఫిలిమ్ మేకర్స్, ఆగష్టు 11 న ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో గ్రాండ్ గా ఆడియో రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్నారు ఫిలిమ్ మేకర్స్.

ఈ ఆడియో రిలీజ్ కన్నా ముందే సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న వీడియో సింగిల్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. అయితే ఆ సింగిల్ రిలీజ్ డేట్ వివరాలు రేపు అఫీషియల్ గా చేయనున్నారు. ఈ విషయం స్వయంగా మారుతి ట్వీట్ చేసి కన్ఫమ్ చేశాడు.

నాగ చైతన్య ని సరికొత్త డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు మారుతి ఈ సినిమాలో. అనూ ఇమ్మాన్యువెల్  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సినిమా సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 31 న గ్రాండ్ గా రిలీజవుతుంది.