పని పూర్తి చేసుకున్న ‘శైలజారెడ్డి అల్లుడు’

Tuesday,August 14,2018 - 07:04 by Z_CLU

నాగ చైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గోవాలో లాస్ట్ షెడ్యూల్ జరుపుకున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ లో నాగచైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ కాంబినేషన్ లో సాంగ్ తెరకెక్కించారు. గత వన్ వీక్ గా ఈ సాంగ్ తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న ఫిలిమ్ మేకర్స్ సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు.

ఈ నెల 18 న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ జరుపుకోనుంది ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా యూనిట్. ఈ లోపు రీసెంట్ గా ‘అనూ బేబీ’ అనే సింగిల్ ని రిలీజ్ చేసి ఆడియో ఇంపాక్ట్ చేశారు. అయితే ఇదే వరసలో ఆడియో రిలీజ్ కి సరిగ్గా 2  రోజుల ముందు  ఆగష్టు  16 న  ఈ సినిమా నుండి మరో సింగిల్ ని రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ సింగిల్ తో సినిమా చుట్టూ  పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకున్న ఫిలిమ్ మేకర్స్, సెకండ్ సింగిల్ తో మరింత ఎట్రాక్ట్ చేయనున్నారు.

 

 

గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేస్తుంది. అనో ఇమ్మన్యువేల్ హీరోయిన్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమా ఆగష్టు 31 న ఈ సినిమా రిలీజవుతుంది.