సెప్టెంబర్ 13న శైలజారెడ్డి అల్లుడు రిలీజ్

Tuesday,August 28,2018 - 06:09 by Z_CLU

నాగచైతన్య-అను ఎమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో పాటు దర్శకుడు మారుతి అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

రిలీజ్ డేట్ తో పాటు థియేట్రికల్ ట్రయిలర్ పై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రేపు శైలజారెడ్డి అల్లుడు ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. ఒకేసారి రెండు ఎనౌన్స్ మెంట్స్ తో అక్కినేని ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చేసింది.

లెక్కప్రకారం శైలజారెడ్డి అల్లుడు సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రావాలి. కానీ కేరళలో వరదల కారణంగా రీ-రికార్డింగ్ పూర్తికాలేదు. సంగీత దర్శకుడు గోపీసుందర్, కొచ్చిలో ఈ సినిమా రీ-రికార్డింగ్ పెట్టుకున్నాడు. వరదల కారణంగా అది సాధ్యంకాలేదు. అలా వాయిదాపడిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వస్తోంది.