శైలజారెడ్డి అల్లుడు ఎట్రాక్షన్స్

Tuesday,September 11,2018 - 04:56 by Z_CLU

వినాయక చవితి సందర్భంగా వరసగా 6 సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ఈ వరసలో హెవీ క్రేజ్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. సాంగ్స్, ట్రైలర్, వీటికి తోడు రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా సెకండ్స్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమాకు సంబంధించి టాప్-10 ఎట్రాక్షన్స్ మీకోసం…

స్టోరీలైన్అత్త, అల్లుడు కాంబినేషన్ సినిమాలు అక్కినేని ఫ్యామిలీకి కొత్తేం కాదు. ఇలాంటి స్టోరీలైన్ తో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరూపించుకున్నవే. ఇప్పుడు అదే రూట్ లో నాగచైతన్య చేసిన సినిమా ఇది. అందునా ఇలాంటి స్టోరీలైన్ తో ఈ మధ్య సినిమాలు రాలేదు కాబట్టి, ఈ సినిమా చుట్టూ ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది.

మారుతి మార్క్ ఎంటర్ టైన్ మెంట్అటు ఇమోషనల్ గా కనెక్ట్ చేస్తూనే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా ఇది. మారుతి మార్క్ అనగానే, సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందనే ఫీలింగ్ ఆడియెన్స్ లో ఉంది. అది వంద శాతం గ్యారెంటీ అంటున్నాడు మారుతి. తన కెరీర్ లో నాగచైతన్య చేసిన ఫుల్ లెంగ్త ఎంటర్ టైనర్ ఇదే.

నాగచైతన్యసినిమాలో నాగచైతన్య లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టైలిష్ గా కనిపిస్తూనే అంతకంటే మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు చై. నాగచైతన్య గత సినిమాలతో కంపేర్ చేస్తే, శైలజా రెడ్డి అల్లుడు గా కొత్త చైతును చూడబోతున్నామనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. ఈ మూవీలో నాగచైతన్య క్యారెక్టర్ పేరు కూడా చైతూనే.

గోపీ సుందర్ మ్యూజిక్మారుతి, నాగచైతన్య కాంబినేషన్ అనగానే చాలా క్రేజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది గోపీసుందర్ మ్యూజిక్. సూపర్ హిట్టయిన సాంగ్స్ విజువల్ గా మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అనే ఫీల్ క్రియేట్ చేస్తుంది.

రమ్యకృష్ణ సినిమాలో లవ్ ఎలిమెంట్స్ పక్కన పెడితే, మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే శైలజారెడ్డి రోల్ ని ప్లే చేసింది రమ్యకృష్ణ. నాగచైతన్య కి టఫ్ఫెస్ట్ అత్తగా, మోస్ట్ ఈగోయిస్టిక్ విమెన్ గా స్ట్రాంగ్ క్యారెక్టర్ లో  కనిపించనుంది. నాగచైతన్య, రమ్యకృష్ణ కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.

అనూ ఇమ్మాన్యువెల్సినిమాకి మోస్ట్ క్యూటెస్ట్ ఎట్రాక్షన్. కరియర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించే చాన్స్ కొట్టేస్తున్న ఈ లక్కీ NRI, నాగచైతన్యతో పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ జోడీ అనిపించుకుంటుంది. ఈ జంట జెనరేట్ చేసే మ్యాజిక్ సిల్వర్ స్క్రీన్ మరింత మెస్మరైజ్ చేయడం గ్యారంటీ.

వెన్నెల కిషోర్ఈ మధ్య హిట్టయిన ప్రతి సినిమాలో వెన్నెల కిషోర్ పేరుంటుంది. చేసే ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోయేంతలా ఇరగదీస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ తో నవ్వించనున్నాడు ఈ కమెడియన్.

యాక్షన్ ఎలిమెంట్స్ : సినిమాలో యాక్షన్ కి ఏ మాత్రం లోటు లేదని ఈ సినిమా ట్రైలర్ రిలీజయినప్పుడే క్లారిటీ ఇచ్చింది సినిమా యూనిట్. జస్ట్ ఫ్యామిలీ డ్రామాతో సరిపెట్టకుండా, చైతు స్టామినా ఎలివేట్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేశాడు దర్శకుడు మారుతి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ : ఈ సినిమా నుండి ఏ చిన్న వీడియో రిలీజ్ అయిన, వైడ్ రేంజ్ లో రీచ్ అవ్వడానికి రీజన్  ప్రొడక్షన్ వ్యాల్యూస్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై తెరకెక్కిన ఈ సినిమాని, కాస్టింగ్ దగ్గరి నుండి, టెక్నికల్ ఎలిమెంట్స్ వరకు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు ఫిలిమ్ మేకర్స్.

నరేష్ – మురళీ శర్మ : లాస్ట్ బాట్ నాట్ లీస్ట్… శైలజారెడ్డి భర్తగా నరేష్, నాగచైతన్య తండ్రిగా మురళీ శర్మ నటించారీ సినిమాలో. ఈగోయిస్టిక్ భార్యతో వేగే భర్తగా నరేష్, నాగచైతన్యను ఇబ్బందిపెట్టే తండ్రిలా మురళీశర్మ కీ రోల్స్ ప్లే చేశారు.