రజినీకాంత్ సినిమాలో హైలెట్ కానున్న ఎలిమెంట్

Tuesday,August 07,2018 - 02:01 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది రజినీకాంత్ కొత్త సినిమా.  అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం డార్జిలింగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో 25 రోజుల పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు ఫిలిమ్ మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే హైలెట్ కానున్నాయి.

ఈ సినిమా స్టోరీలైన్ ఇంకా రివీల్ కాలేదు కానీ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టు కార్తీక్ సుబ్బరాజు సినిమాలోని ప్రతి ఫైట్ సీక్వెన్సెస్ కి ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నాడట. డార్జిలింగ్ లో ప్రస్తుతం పీటర్ హెయిన్స్  అధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కుతుంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన సిమ్రాన్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి తో పాటు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.  అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.