శ్రీమంతుడు.. మరోసారి గుర్తొచ్చాడు

Tuesday,August 07,2018 - 10:45 by Z_CLU

“ఈ కాలం సందేశాలు ఇస్తే ఎవరు చూస్తారండి. అందరికీ మసాలా కావాలి. ఐటెంసాంగ్స్ కావాలి. రోప్ ఫైట్స్ కావాలి. అందుకే మేం అలాంటి సినిమాలే తీస్తాం.”
ఏళ్లుగా సినీజనాల్లో పాతుకుపోయిన ఫీలింగ్ ఇది. ఆడియన్స్ లో కూడా ఇది మెసేజ్ సినిమా, ఇది కమర్షియల్ సినిమా అనే తేడా వచ్చేసింది. ఈ పడికట్టు లెక్కలన్నింటికీ అతీతంగా వచ్చాడు శ్రీమంతుడు. అదిరిపోయే మెసేజ్ తో పాటు కళ్లుచెదిరే కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.

శ్రీమంతుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. ఈ సినిమా వచ్చిన తర్వాతే గ్రామాల దత్తత అనే కాన్సెప్ట్ మరింత ఊపందుకుంది. ఎంతోమంది ప్రముఖులు గ్రామాల్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. అలా ఎన్నో గ్రామాల రూపురేఖల్ని మార్చేసింది శ్రీమంతుడు సినిమా.

ఓవైపు కమర్షియల్ ఎలిమెంట్స్, మరోవైపు కనెక్ట్ అయ్యే సందేశం.. ఇలా బ్యాలెన్స్ డ్ గా తెరకెక్కింది శ్రీమంతుడు. కొరటాల-మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కళ్లుచెదిరే రికార్డులు క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో ఇప్పటికీ టాప్-5 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా కొనసాగుతోంది.

2015న సరిగ్గా ఇదే రోజు విడుదలైన ఈ సినిమా ఇవాళ్టితో మూడేళ్లు పూర్తిచేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ కు ఇదే మొదటి సినిమా.