మహేష్ ఖాతాలో మరో రికార్డు!

Tuesday,December 08,2020 - 02:15 by Z_CLU

సూపర్ స్టార్ Mahesh Babu ఖాతాలో మరో సోషల్ మీడియా రికార్డు నమోదైంది. ఈ ఏడాదికి గానూ మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ కేటగిరిలో #SarileruNeekevvaru హ్యాష్ ట్యాగ్ నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా గురించి ట్విట్టర్ లో భారీ స్థాయిలో ట్వీట్స్ వేసారంటూ ఇయర్ రివ్యూలో భాగంగా ఈ విషయాన్ని Twitter India వెల్లడించింది. ఈ లిస్టులో మొదటి స్థానంలో బాలీవుడ్ సినిమా #DilBechara నిలవగా రెండో స్థానంలో సూర్య నటించిన #SooraraiPottru సినిమా నిలిచింది.

Most-tweeted-hashtag-news-sarileruneekevvaru

గతంలో మహేష్ సినిమాలకు సంబంధించి 2018 లో’భరత్ అనే నేను’, 2019 లో ‘మహర్షి’ సినిమాలు మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్స్ లిస్టులో నిలిచాయి. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’తో వరుసగా మూడేళ్ళు ఈ లిస్టులో నిలిచి హట్రిక్ రికార్డు నెలకొల్పాడు మహేష్. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఈ రికార్డు సంతోషాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.