మహేశ్ ‌బాబు

Saturday,November 21,2020 - 03:31 by Z_CLU

ఘట్టమనేని మహేశ్ బాబు ఆగస్టు 9, 1975 లో జన్మించారు. మహేశ్ బాబు ప్రముఖ కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు. కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘నీడ’ చిత్రం తో బాల నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత కృష్ణ నటించిన కొన్ని చిత్రాల్లో బాల నటుడిగా నటించి, ‘రాజకుమారుడు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో కథానాయకుడిగా గుర్తింపు తో పాటు విజయం అందుకున్న మహేశ్ ఈ సినిమాకు గాను బెస్ట్ మేల్ డెబ్యూట్ కేటగిరిలో నంది అవార్డు ను అందుకున్నారు.

ఈ చిత్రం తరువాత ‘యువరాజు’, ‘వంశీ’ చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన మహేశ్ కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘మురారి’ తో మరో విజయం అందుకున్నారు. ఈ చిత్రం గాను మరో సారి నంది అవార్డు అందుకున్నారు.

‘ఒక్కడు’ చిత్రంతో బెస్ట్ యాక్టర్ కేటగిరి లో ఫిలింఫేర్ అవార్డు ను అందుకున్నారు. ఈ చిత్ర తరువాత నిజం సినిమాకు గాను మరో నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రం తరువాత ‘నాని’, ‘అర్జున్’ సినిమాలలో నటించిన మహేశ్ ‘అతడు’ తో మరో  నంది అవార్డు అందుకున్నారు.

‘పోకిరి’ చిత్రం తో భారీ కలెక్షన్స్ సాధించి కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం తో మరో ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. టాలీవుడ్ కథానాయకుడిగా 7 నంది అవార్డులను అందుకున్న మహేష్ నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులను, 3 సైమా అవార్డులలను అందుకొని సూపర్ స్టార్ గ ఎదిగారు.  ఇక ‘దూకుడు’, ‘బిజినెస్ మేన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టును’ చిత్రాలతో విజయాలు అందుకున్న మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ అందుకొని ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి రెండో స్థానం లో నిలిచి ఈ చిత్రంకు గాను ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకడమి అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మహర్షి, భరత్ అనే నేను సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.

మహేశ్ GMB ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్.లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ ను ప్రారంభించి తాను నటించే సినిమాలలో భాగస్వామిగా కొనసాగుతున్నారు.

Born : Aug 9, 1975
Zodiac : Leo
Height : 1.85m

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు