సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న పూరి!

Tuesday,December 08,2020 - 03:00 by Z_CLU

విజయ్ దేవరకొండపూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా మొదలై చాలా నెలలవుతుంది. ముంబైలో నలబై శాతం షూట్ పూర్తయింది. కానీ ఇంతవరకూ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు పూరి. అంతెందుకు ఇంతవరకూ టైటిల్ కూడా అఫీషియల్ గా చెప్పలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకూ ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి విజయ్ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి రెడీ అవుతున్నారట టీం.

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాకు సంబంధించి విజయ్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి టైటిల్ చెప్పబోతున్నారట.  ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్ నే సినిమా టైటిల్ గా పెడతారా… లేదా… అనేది తెలియాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా జనవరి నుండి  ముంబైలో మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ , కరణ్ జోహార్, ఛార్మీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Check ‘ఫైటర్’ లో మదర్ సెంటిమెంట్

పూరి బర్త్ డే స్పెషల్ ఆర్టికల్