సమంతా కొత్త సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అయింది

Thursday,July 12,2018 - 04:32 by Z_CLU

‘యూ టర్న్’ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తుంది సమంతా. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా టాకీపార్ట్ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ లో ఈ సినిమాలోని సాంగ్స్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.

ఒక ఫ్లై ఓవర్ పై మిస్టీరియస్ గా జరిగే ఆక్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది U టర్న్. వరసగా జరిగే ఆ ఆక్సిడెంట్స్ వెనక మిస్టరీని బయటపెట్టే, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా సమంతా ఈ సినిమాలో నటిస్తుంది. ఆది పినిశెట్టి ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో హైలెట్ కానున్నాయి.

భూమిక కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి పోలీసాఫీసర్ లా కనిపించనున్నాడు. పవన్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస్ చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.