‘గీతా గోవిందా’నికి రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్

Thursday,July 12,2018 - 06:06 by Z_CLU

జస్ట్ ఒక్క సింగిల్ తోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది విజయ్ దేవరకొండ గీతా గోవిందం. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ కి క్రియేట్ అవుతున్న క్రేజ్ చూస్తుంటే, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని చెప్పడానికి ఇంకేం కావాలి.. అనిపిస్తుంది. జస్ట్ 24 గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ రికార్డ్ చేసిన ఈ సింగిల్, 2 రోజు కల్లా 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

అనంత శ్రీరామ్ లిరిక్స్, దానికి సిద్ శ్రీరామ్ పాడిన తీరు జస్ట్ అవుట్ స్టాండింగ్ అనిపించుకుంటుంది. ఈ సినిమాలో ఇంకా ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయో ఫిల్మ్ మేకర్స్ రివీల్ చేయలేదు కానీ, మ్యూజిక్ లవర్స్ లో ఈ ఆల్బమ్ పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది ఈ సాంగ్.

GA2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్ ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. హార్ట్ టచింగ్ లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15 న రిలీజవుతుంది. పరశురాం ఈ సినిమాకి డైరెక్టర్. గోపీ సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.