సమంతా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Friday,September 07,2018 - 01:43 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హీరోయిన్ అనిపించుకుంటున్న సమంతా, సక్సెస్ ఫుల్ కరియర్ తో బిజీబిజీగా ఉంది. పెళ్ళి తరవాత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునేంత ఇండిపెండెంట్ అయ్యానని చెప్పుకున్న సమంతా, మరెన్నో విషయాలను ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకుంది. అవి మీ కోసం…

 రిస్క్ తో సక్సెస్…

ఈ ఇయర్ చేసిన సినిమాల్లో మ్యాగ్జిమం రిస్క్ లే.. తీసుకున్న ప్రతి రిస్క్ సక్సెస్ గా ట్రాన్స్ ఫామ్ అయింది. ‘రంగస్థలం’ లో విలేజ్ గర్ల్ లా, ‘మహానటి’ లో నాది టైటిల్ రోల్ కాదని తెలిసి కూడా చేశాను. అభిమన్యుడు విషయానికి వచ్చేసరికి కొత్త డైరెక్టర్. ఈ సినిమాలు సక్సెస్ అయినందుకు నిజంగా చాలా హ్యాప్పీ…

చాలా మారిపోయింది…

ఇప్పుడందరి దృష్టి మారిపోయింది. ఒకప్పుడు ఒక హీరోయిన్ కి స్టార్ హీరో సినిమాల్లో చాన్స్ దొరకలేదంటే, ఇక తన పని అయిపోయింది అనేవారు. ఇప్పుడలా లేదు. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఆడుతున్నాయి. చాలా హ్యాప్పీ.

సక్సెస్ కి రీజన్ అదే…

డిఫెరెంట్ కంటెంట్ తో నన్ను అప్రోచ్ అయిన ఫిలిమ్ మేకర్స్ దగ్గరి నుండి, నా చుట్టూ ఉండే వాళ్ళే నా సక్సెస్ కి రీజన్. కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు, కొందరి ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటాను. వాళ్ళు కూడా నా సక్సెస్ కి రీజనే.

నాకలా అనిపిస్తుంది…

కొని సినిమాల విషయంలో ఆలోచిస్తే నేను ఆ సినిమాలను చూజ్ చేసుకున్నాను అనే కంటే, ఆ సినిమాలే నన్ను  చూజ్ చేసుకున్నాయి అనిపిస్తుంటుంది. ఆ విషయంలో నేను చాలా లక్కీ.

అదీ రచన…

‘యూటర్న్’ సినిమాలో నా పేరు రచన. జర్నలిస్ట్ గా తన ప్రొఫెషన్ ని చాలా సీరియస్ గా తీసుకునే అమ్మాయి. అంతలోఒక ప్రాబ్లమ్ లో ఇరుక్కోవడం, అక్కడి నుండి ఎలాగైనా బయటపడే ప్రయత్నం చేయడం.. ఆ కంప్లీట్ జర్నీ అద్భుతంగా ఉంటుంది.

సినిమాలో హీరో బాధ్యత…

హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే హీరోలది చాలా పెద్ద బాధ్యత. ఒక సినిమా చేశామంటే ఆడియెన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇంప్రెస్ చేయాలి. ఒక సినిమా చేయడం అంటే అందులో చాలా జీవితాలు ముడిపడి ఉంటాయి. హీరోతో కంపేర్ చేస్తే అంత ప్రెజర్ నేను ఒక్క ‘యూటర్న్’ విషయంలోనే ఫీలయ్యా.

నేను క్రియేట్ చేయగలిగాను…

సమంతా ఒక సినిమా చేసిందంటే అందులో కొద్దో గొప్పో కంటెంట్ డెఫ్ఫినేట్ గా ఉంటుందనే ఫీల్ ని. ఆడియెన్స్ లో నేను క్రియేట్ చేయగలిగాను అని అనుకుంటున్నా. ఫ్యూచర్ లో కూడా అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నాను.

అదొక్కటే ఫార్ములా…

నేను సినిమా సంతకం చేయడానికి  ఒకే ఫార్ములా ఫాలో అవుతాను. స్టోరీ విన్నప్పుడు ఆడియెన్ లా ఆలోచించి, నేను థియేటర్ లో ఎంజాయ్ చేస్తానా లేదా…?, చేస్తాను అనిపించినప్పుడు, ఇమ్మీడియట్ గా డైరెక్టర్ గురించి ఆలోచిస్తాను. స్టోరీ చెప్పినట్టు ఎగ్జిక్యూట్ చేయగలడా లేదా…?.. ఈ 2 పాయింట్స్ లో కాన్ఫిడెంట్ గా అనిపిస్తే చాలు సంతకం చేసేస్తా…

త్వరలో నిర్మాతగా…

ప్రస్తుతానికి నటిగా చాలా ఎంజాయ్ చేస్తున్నా.. కానీ సినిమాలను నిర్మించాలని కూడా ఉంది. ఎప్పుడనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ డెఫ్ఫినేట్ గా ప్రొడ్యూసర్ నవుతా…

పెళ్ళికి ముందు -పెళ్ళికి తరవాత  

పెళ్ళి చేసుకుంటే కరియర్ స్పాయిల్ అవుతుందనుకుంటే అది తప్పే అనిపిస్తుంది. నా వరకు నేను పెళ్ళికి ముందు కన్నా పెళ్ళి తరవాతే ఇంకా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటున్నా… ఇంకా ఇండిపెండెంట్ గా ధైర్యంగా ఆలోచించగలుగుతున్నా…

క్లైమాక్స్ లో కొంచెం…

‘యూటర్న్’ కన్నడ ఒరిజనల్ క్లామాక్స్ కి ఈ సినిమా క్లైమాక్స్ లో కొన్ని చేంజెస్ చేశారు. అంటే కొంతమంది ఆల్రెడీ కన్నడలో సినిమా చూసినవారికి ఏదైనా కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో డైరెక్టర్ తీసుకున్న డెసిషన్ అది.