భూమిక ఇంటర్వ్యూ

Monday,September 10,2018 - 03:20 by Z_CLU

సమంతా లీడ్ రోల్ ప్లే చేసిన యూ టర్న్’ మూవీ ఈ నెల 13 న రిలీజవుతుంది. ఈ మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ లో భూమిక కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భూమిక తన ఫ్యూచర్ కరియర్ ప్లానింగ్స్ తో పాటు, టాలీవుడ్ లో వస్తున్న చేంజెస్ గురించి మాట్లాడింది అవి మీకోసం…

నాకు ఆ అవకాశం ఇచ్చింది…

నటిగా డిఫెరెంట్ రోల్స్ ప్లే చేయాలి. అలాంటి మరో అవకాశం ఇచ్చిన సినిమా యూ టర్న్.

ఒరిజినల్ తో కంపేర్ చేస్తే…

నేను ఒరిజినల్ ‘యూటర్న్’ చూశాను. కానీ దాన్ని ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు. నాకు డైరెక్టర్ ఏం చేయాలో చెప్తే, దాన్ని నా స్టైల్ లో ప్రెజెంట్ చేస్తానంతే… ఒరిజినల్ ‘యూ టర్న్’ ఇంపాక్ట్ ఏమీ ఉండదు.

నో చేంజెస్…

ఒరిజినల్ తో కంపేర్ చేస్తే తెలుగు వర్షన్ లో పెద్దగా చేంజెస్ ఉండవు. కాకపోతే నేటివిటీ కి మ్యాచ్ అయ్యేలా చాలా మైనర్ చేంజెస్ చేశారు.

ఇంకా అదే ఫీలింగ్…

నేను హారర్ సినిమాలు చేయను అని ఇంతకు ముందే చెప్పా.. కానీ ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉండవు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందుకే చేశాను.

అట్లీస్ట్ 5% …

మనం ఏ సినిమా చేసినా మన కరియర్ లో 5% అయినా మనం ఎదగాలి. ఈ సినిమాలో నాకా స్టాండర్డ్స్ కనిపించాయి. చాలా డిఫెరెంట్ మూవీ ఇది.

సమాంత గురించి…

నేను సమంతా నటించిన ‘ఈగ’ చూశాను. ఆ తరవాత రీసెంట్ గా ‘రంగస్థలం’ చూశాను. బ్రిలియంట్ నటి. తన చుట్టూరా పాజిటివ్ ఎనర్జీ ఉందా అనిపిస్తుంది.

సినిమాలో నా డ్యూరేషన్…

సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే రోల్ 5 నిమిషాలే అయినా నేను చేసేస్తా. నేను సినిమాలో నేను చేసే రోల్ డ్యూరేషన్ గురించి అస్సలు పెట్టించుకోను. ఇంపార్టెన్స్ గురించే ఆలోచిస్తా…

రిస్క్ అయితే తీసుకోవాల్సిందే…

టాలీవుడ్ లో ఇంకా స్టోరీ బేస్డ్ సినిమాలు రావాలి. చాలా ట్యాలెంట్ ఉంది టాలీవుడ్ లో. కాకపోతే అలాంటి సినిమాలు ఆడకపోతే నష్టపోతాం అనే భయంతో ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం లేదు. ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్స్, ఇలాంటి చిన్న బడ్జెట్ తో, రిస్క్ సినిమాలు చేస్తే బావుంటుందని నా ఫీలింగ్.

నా కొడుకు…

నేనొక సినిమా చేయాలంటే మా అబ్బాయి స్కూల్ కి ఆబ్సెంట్ అవ్వాలి. అంత రిస్క్ చేసి కూడా నేనొక సినిమా చేస్తున్నానంటే, ఆ సినిమాలో అంత విషయం ఉండాలి. లేకపోతే వాడే క్వశ్చన్ చేసే చాన్సెస్ ఉంటాయి…

20 ఏళ్లలో…

నేను 1999 లో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మారింది. నేను మారాను. నా చుట్టూరా ఉన్న జనాలు, పరిస్థితులు.. ట్రెండ్ కూడా మారింది. ఆ చేంజెస్ ని మనం ఎప్పటికప్పుడు ఆక్సెప్ట్ చేస్తూనే ఉండాలి. మారుతూనే ఉండాలి…

కొత్తదనం…

ఆడియెన్స్ ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటూనే ఉంటారు. నేను కూడా వాళ్ళను ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలనే ఆలోచిస్తూ ఉంటాను. చేసిన కారెక్టరే చేస్తుంటే, వాళ్ళు మనతో బోర్ అయిపోతారు.

నంబర్ గేమ్ కాదు…

ఎన్ని సినిమాలు చేశాము అన్నది అస్సలు సంబంధం లేని విషయం. సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి అని నేనేం రూల్ పెట్టుకోను… మంచి సినిమాలు చేయాలి అంతే…

ఏజ్ జస్ట్ నంబర్ అంతే…

40 దాటినా తరవాత చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికీ వాళ్ళ ట్యాలెంట్ ని నిరూపించుకుంటూనే ఉన్నారు. సక్సెస్ ఫుల్ అనిపించుకుంటున్నారు. ఏజ్ కి యాక్టింగ్ కి సంబంధం ఉందని నేననుకోవట్లేదు..