సెన్సార్ పూర్తిచేసుకున్న యు-టర్న్

Friday,September 07,2018 - 06:29 by Z_CLU

సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా యూ-టర్న్. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా U/A సర్టిఫికేట్ తో సెన్సార్ క్లియర్ చేసుకుంది. దీంతో మూవీ రిలీజ్ కు అఫీషియల్ గా లైన్ క్లియర్ అయింది. ఈనెల 13న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది యూ-టర్న్ సినిమా.

మిస్టరీ థ్రిల్లర్ గా ఒకేసారి తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కింది యూటర్న్ సినిమా. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్, ఆది ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించనుంది. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు.

సాంకేతిక విభాగం:

క‌థ‌, ద‌ర్శ‌కుడు: ప‌వ‌న్ కుమార్

నిర్మాత‌లు: శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు

బ్యాన‌ర్స్: శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్

సంగీతం: పూర్ణచంద్ర తేజ‌స్వి

సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి

ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్

ఎడిటర్: సురేష్ ఆర్ముగం