'దర్శకుడు' సాంగ్‌ని రిలీజ్ చేసిన సమంత

Tuesday,July 11,2017 - 12:49 by Z_CLU

డిఫరెంట్ మూవీస్ తో ఎంటర్టైన్ చేస్తూ దర్శకుడిగా ప్రతీ సినిమాకు ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న రెండో సినిమా ‘దర్శకుడు’. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ ‘ఆకాశం దించి మేఘాల్లో సెట్ వేస్తా’  ను ఇటీవలే రకుల్ ప్రీత్‌సింగ్ విడుదల చేయగా లేటెస్ట్ గా ‘సండే టు సాటర్డే’ అనే లవ్ సాంగ్ ను సమంత విడుదల చేసింది .

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ” మాములుగా సుకుమార్ గారి సినిమా గురించి ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ లో వచ్చే సినిమా కోసం  అందరు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని సండే టు సాటర్డే అనే సాంగ్ ను రిలీజ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. సుకుమార్ గారికి అండ్ టీం అందరికీ అల్ ది బెస్ట్.” అన్నారు.

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఆడియో ను రిలీజ్ చేసి ఆగస్టు 4 న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.