అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఫిక్స్

Tuesday,July 11,2017 - 12:17 by Z_CLU

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ ప్రీ ప్రొడక్షన్ స్పీడ్ అందుకుంది.  బన్ని క్యాలెండర్ లో DJ తరవాత ఇమ్మీడియట్ గా సెట్స్ పైకి రానున్న ఈ సినిమా కోసం అనూ ఇమ్మాన్యువెల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్.

మజ్ను సినిమా తరవాత రాజ్ తరుణ్ సరసన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో నటించిన అనూ ఇమ్మాన్యువెల్ ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాలో చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా సెట్స్ పైనే అంతలో బ్యాక్ టు బ్యాక్ మెగా హిట్స్ తో దూసుకుపోతున్న బన్ని సినిమాకి ఫిక్స్ అయింది అనూ ఇమ్మాన్యువెల్. అంది వస్తున్న అవకాశాల్లోంచి బడా బడా సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్న అనూ ఇమ్మాన్యువెల్ స్పీడ్ చూస్తుంటే, టాప్ హీరోయిన్ లిస్టులో చేరడానికి మరెంతో టైమ్ పట్టదు అనిపిస్తుంది.

 

బన్ని ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ రచయితగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారనున్నాడు. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ స్టార్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ స్టార్ శరత్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజర్.