మరో రీమేక్ లో పవన్ కల్యాణ్?

Tuesday,July 11,2017 - 04:06 by Z_CLU

త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా తర్వాత ఆర్.టి.నేసన్ తో పవన్ సెట్స్ పైకి వెళ్తాడనుకున్నారంతా.. అయితే పవన్ మాత్రం ఆ సినిమా కంటే ముందు మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా రీమేక్ అని టాక్.

ఇటీవలే బాలీవుడ్ లో మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన ‘జాలీ ఎల్.ఎల్.బి-2’ సినిమాను పవన్ తెలుగులో రీమేక్ చేయబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ డైరక్ట్ చేస్తాడట.

హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కింది జానీ ఎల్.ఎల్.బీ-2. మంచి సందేశంతో పాటు వినోదాత్మకంగా వచ్చిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేయొచ్చు. ప్రస్తుతం ఆ పనిలోనే సంతోష్ శ్రీనివాస్ బిజీగా ఉన్నాడట. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఈ రీమేక్ పై క్లారిటీ వస్తుంది.