సమంతా ఇంటర్వ్యూ

Tuesday,September 11,2018 - 03:46 by Z_CLU

సమంతా ‘U Turn’ ఈ నెల 13 న రిలీజవుతుంది. మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమాలో సమంతా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లా కనిపించనుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది సమంతా. అవి మీకోసం…

స్క్రిప్ట్ చేంజ్…

కన్నడ వర్షన్ కి తెలుగు వర్షన్ కి చాలా చోట్ల చేంజెస్ చేయడం జరిగింది. నేటివిటీ మైండ్ లో పెట్టుకుని కొన్ని చేంజెస్ చేస్తే, కొన్ని చోట్ల థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది. దానివల్ల కన్నడ వర్షన్ కన్నా తెలుగు వర్షన్ అప్డేటెడ్ అనిపిస్తుంది.

అందుకే ఇంత లేట్…

కన్నడ ‘UTurn’ ట్రైలర్ చూడగానే పవన్ కుమార్ కి కాల్ చేసి, ఈ సినిమా కోసం నన్నెందుకు తీసుకోలేదు అని అడిగాను. ఇమ్మీడియట్ గా స్క్రిప్ట్ పంపమని చెప్పి చదివాను. చదివిన తరవాత ఎలాగైనా ఈ సినిమా చేయాలనిపించింది. కానీ ఈ లోపు నాకు ఆల్రెడీ కమిట్ మెంట్స్ ఉండటం, ఈ సినిమా కోసం హర్ క్ట్ చేయాల్సి రావడం లాంటి రీజన్స్ తో కొంచెం టైమ్ పట్టింది..

బాక్సాఫీస్ ప్యారామీటర్…

స్టార్ హీరో సినిమాల్లో నటించడం కన్నా ఈ సినిమా విషయంలో కొంచెం ప్రెజర్ పడ్డాను ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా బాక్సాఫీస్ ప్యారమీటర్ పైనే సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది లైవ్స్ డిపెండ్ అయి ఉంటాయి.

అన్నింటి కన్నా ముందు…

సెప్టెంబర్ 13 సినిమా రిలేజ్ అనగానే చై Vs స్యామ్ అని చాలా చోట్ల రాశారు. కానీ నాకు మాత్రం నా సక్సెస్ కన్నా చై సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే నాకు అన్నింటి కన్నా ముందు ‘చై’ అల్టిమేట్ ప్రయారిటీ. ఇక్కడ Vs కాదు, చై తో స్యామ్.

నేనే నిర్మిద్దామనుకున్నా…

ఈ సినిమాని నేనే నిర్మిద్దామనుకున్నా, అంతగా నచ్చేసింది. కానీ యాక్టింగ్ తో ప్రొడక్షన్… మ్యానేజ్ చేయలేనేమో అనిపించింది. కానీ డెఫ్ఫినేట్ గా ఫ్యూచర్ లో సినిమాలు నిర్మిస్తా…

స్టోరీనే హీరో…

UTurn కి హీరో స్టోరీనే… ఆ స్టోరీని ముందుకు నడిపించడానికి మేము జస్ట్ క్యారెక్టర్స్ ప్లే చేశాం.

స్కూల్ స్యామ్…   

ప్రోమో సాంగ్ లో నా డ్యాన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని సినిమాల్లో చేసినా, నాకు అంతగా డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. స్కూల్లో ఉన్నపుడు కూడా నేను చాలా డ్యాన్ చేసేదాన్ని. మళ్ళీ అలాంటి అవకాశం ఈ సినిమాతో దొరికింది. ఫ్ర్రెండ్స్ అయితే ఇన్నాళ్ళకు స్కూల్ స్యామ్ కనిపించింది అంటున్నారు.

సెక్యూర్డ్ స్పేస్…

ఇప్పటికైతే నేను చాలా సెక్యూర్డ్ స్పేస్ లో ఉన్నానని అనుకుంటున్నాను. అందుకే స్టోరీ బేస్డ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. సమంతా ఏ సినిమా చేసినా సమ్ థింగ్ స్పెషల్ ఉంటుంది అనిపించుకోవాలి.

ఇదే కరెక్ట్ టైమ్…                          

కరియర్ లో ఈ స్టేజ్ కి రీచ్ అయ్యాక కంప్లీట్ యాక్టర్ అనిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. అందుకే నా డబ్బింగ్ నేను చెప్పుకుంటున్నా. నా దృష్టిలో డబ్బింగ్ చెప్పుకోగలిగినప్పుడే కంప్లీట్ యాక్టర్ అయినట్టు.

శైలజారెడ్డి అల్లుడు సినిమా…

ఈ సినిమా నేనింకా కంప్లీట్ గా చూడలేదు కానీ చూసినంత వరకు ఫుల్ టూ ఎంటర్టైనింగ్… పండక్కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా.