ఫోకస్ మొత్తం శైలజారెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే...

Friday,September 07,2018 - 03:22 by Z_CLU

ఈ ఆదివారం గ్రాండ్ గా జరగనుంది ‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్. కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం, అప్పుడే గ్రౌండ్ వర్క్ బిగిన్ చేసేసింది సినిమా యూనిట్. ఫుల్ టూ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో జరగనున్న ఈ ఈవెంట్ లో, ఈ సినిమాకి సంబంధించి ఎగ్జైటింగ్ ఎక్స్ పీరియన్సెస్ షేర్ చేసుకోనుంది సినిమా టీమ్.

అయితే ఈ ఈవెంట్ పై ఇంతలా క్రేజ్ క్రియేట్ అవ్వడానికి మరో రీజన్ నాగార్జున, నాని ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వడం. ప్రస్తుతం ‘దేవదాస్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు సెప్టెంబర్ 9 న జరగనున్న ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ వస్తుండటంతో, ఈ ఈవెంట్ పై మరింత ఫోకస్ పెరిగిపోయింది.

సెప్టెంబర్ 13 నుండి ‘శైలజారెడ్డి అల్లుడు’ లా మెస్మరైజ్ చేయనున్నాడు నాగచైతన్య. దర్శకుడు మారుతి కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్స్ లో చైతుని ప్రెజెంట్ చేస్తున్నాడు. గోపీసుందర్ మ్యూజిక్ కంపోజర్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నాగవంశీ నిర్మిస్తున్నాడు.