సమంతా ఇంటర్వ్యూ

Friday,August 31,2018 - 04:11 by Z_CLU

సమంతా ‘U టర్న్’ సెప్టెంబర్ 13 న రిలీజవుతుంది. మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న సమంతా, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుంది అవి మీకోసం…

సేమ్ టు సేమ్…

మహానటి సినిమాలో కూడా జర్నలిస్ట్ గా చేశాను. ఈ సినిమాలో కూడా జర్నలిస్ట్ చేశాను. రెండింటిలో ఉన్న సిమిలారిటీ ఏంటంటే, 80 లో అయినా ఇప్పుడైనా మేల్ డామినేషన్ ని ఫేస్ చేసే క్యారెక్టర్… అక్కడ అదే ప్రాబ్లమ్.. ఇక్కడ అదే ప్రాబ్లమ్…

‘U టర్న్’ లో నో సాంగ్స్…

ఈ సినిమాలో సాంగ్స్ లేవు కానీ ఒక్క ప్రోమోసాంగ్ ఉంది. అనిరుద్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ డెఫ్ఫినేట్ గా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది.

అయినా కంగారు పడలేదు…

కన్నడ ‘U టర్న్’ పెద్ద సక్సెస్ కాబట్టి డెఫ్ఫినేట్ గా కంపారిజన్స్ ఉంటాయి. కానీ నాకు ఏం భయమనిపించలేదు.  డైరెక్టర్ పవన్ కుమార్ బిగినింగ్ నుండి చాలా కాన్ఫిడెంట్ గా క్లారిటీ గా ఉన్నాడు.

కొంచెం కష్టం అనిపించింది…

సినిమాని ఒకేసారి 2 లాంగ్వేజెస్ లో తెరకెక్కించాం కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కో ఇమోషన్ ని 2 లాంగ్వేజెస్ లో 2 సార్లు ప్రెజెంట్ చేయడం, రెగ్యులర్ గా చేసే సినిమాలతో కంపేర్ చేస్తే కొంచెం కష్టం అనిపించింది.

జస్ట్ ఫ్యాన్స్ కాదు…

ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటా… వాళ్ళు నాకు జస్ట్ ఫ్యాన్సే కాదు, అందులో చాలా మంది నా వెల్ విషర్స్ ఉంటారు.. సజెస్ట్ చేస్తుంటారు… డెఫ్ఫినేట్ గా నేనేవన్నీ ఫాలో అవుతుంటాను.

అదీ ‘U టర్న్’ సినిమా…

సినిమా చూస్తున్నంత సేపు జస్ట్ చూస్తూ ఉండిపోతారంతే, కనీసం ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేరు అలా ఉంటుంది సినిమా. ఒకవేళ కొంచెం డైవర్ట్ అయినా, అక్కడ ఏదో పాయింట్ మిస్ అయిపోతాం. అలా ఉంటుంది ఈ సినిమా.

కన్నడలో ప్రమోట్ చేశాను…

ఈ సినిమాని కన్నడలో ప్రమోట్ చేశాను. ట్రైలర్ చూసినప్పుడే నాకు చాలా నచ్చేసింది. ఆ సినిమా రిలీజవ్వక ముందే రీమక్ లో చేసేయాలనుకున్నా. పవన్ కుమార్ కూడా ఫిక్సయ్యాడు. సినిమా కన్నడలో హిట్టవ్వడమనేది అడిషనల్ బోనస్…

తన సొంత ఫార్మాట్…

డైరెక్టర్ పవన్ కుమార్ కొంచెం డిఫెరెంట్. ఏం చేసినా ఆయన సొంత ఫార్మాట్ ఉంటుంది. స్పెషల్ గా కాస్టింగ్ విషయంలో క్యారెక్టర్ కి ఎవరు సూటవుతారా..? అని ఆలోచిస్తాడు కానీ కాంబినేషన్ ని నమ్ముకోడు…

ఇంకా బెటర్ గా…

కన్నడ ‘U టర్న్’ తో కంపేర్ చేస్తే ఈ వర్షన్ ని చాలా బెటర్ గా తీశారు. ఆది పినిశెట్టి, భూమిక పర్ఫామెన్స్ సినిమాకి చాలా పెద్ద ఎసెట్. సినిమా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా…