సమంతా ‘యూ టర్న్’ ట్రైలర్ - రిలీజ్ కి రెడీ

Monday,August 13,2018 - 03:19 by Z_CLU

సెప్టెంబర్ 13 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది సమంతా ‘యూ టర్న్’ సినిమా. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆడియెన్స్ లో సినిమాపై క్యూరియాసిటీని జెనెరేట్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన ఫిలిమ్ మేకర్స్ ఈ నెల 17 న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ జేనేరేట్ కాయ్యేలా ఈ ట్రైలర్ ని ప్రెజెంట్ చేయనున్నారు ఫిలిం మేకర్స్. సమంతా లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో భూమిక, ఆది పినిశెట్టి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

ఒక ఫ్లై ఓవర్ పై మిస్టీరియస్ గా జరిగే ఆక్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది U టర్న్. వరసగా జరిగే ఆ ఆక్సిడెంట్స్ వెనక మిస్టరీని బయటపెట్టే, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా సమంతా, పోలీసాఫీసర్ గా ఆది పినిశెట్టి కనిపించనున్నారు.

పవన్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి మరియు రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.