సెట్స్ పైకి వచ్చిన నాగార్జున కొత్త సినిమా

Friday,September 07,2018 - 12:06 by Z_CLU

నాగార్జున కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. నిన్న పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమా ఈ రోజు నుండి ఫుల్ టైమ్ సెట్స్ పైకి వచ్చేసింది.

ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న ఫిలిమ్ మేకర్స్, సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన టీమ్, ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ కూడా నటిస్తున్నాడు. S.J. సూర్య, శరత్ కుమార్ లు సినిమాలో కీ రోల్స్ ప్లే చేయనున్నారు. శ్రీ తెనాండల్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి షాన్ రోల్డన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.