ప్రభాస్ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీస్

Wednesday,August 21,2019 - 10:02 by Z_CLU

సాహో సీజన్ బిగిన్ అయింది. అటు బాలీవుడ్ లో, సోషల్ మీడియాలో… ఎక్కడ చూసినా ప్రభాస్ మానియా కనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ‘బ్యాడ్ బాయ్’ సాంగ్ యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అనిపించుకుంటున్న జాక్లిన్ ఫెర్నాండెజ్ ప్రభాస్ సరసన కనిపించడం సినిమా స్టాండర్డ్స్ ని మరింత ఎలివేట్ చేస్తుంది… ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా 5 గురు బాలీవుడ్ హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రెబల్ స్టార్.

జాక్లిన్ ఫెర్నాండెజ్ : నిజానికి ఈ సాంగ్ ప్రోమో చూసేంతవరకు జాక్లిన్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రాలేదు. సడెన్ గా ‘సాహో’ ఈవెంట్ లో ప్రోమో రిలీజ్ చేసేసరికి ఫ్యాన్స్ ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు. ఇకపోతే ఈ హాట్ సిజ్లింగ్ హీరోయిన్ సాహోలో ఎంత సేపు ఉంటుందో ప్రస్తుతానికి సస్పెన్సే కానీ, ఉన్న స్పేస్ లో సిల్వర్ స్క్రీన్ పై హీట్ జెనెరేట్ చేయడం గ్యారంటీ.

శ్రద్ధాకపూర్ : అనుష్క తరవాత ప్రభాస్ కి పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ పార్టనర్. సాహో సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర కాబోతుంది.

ఎవ్లీన్ శర్మ : ఈ హీరోయిన్ కూడా ‘సాహో’ లో నటించింది. కాకపోతే ఈ కాంబోలో విజువల్స్ ఇంకా బయటికి రాలేదు. సినిమాలో ఈ బాలీవుడ్ హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువగా యాక్షన్ సీక్వెన్సెస్ లో ఉండబోతుందట.

కంగనా రనౌత్ ఏక్ నిరంజన్ లో ప్రభాస్ సరసన కంగనా రనౌత్ నటించింది. ఈ సినిమా తరవాత మళ్ళీ కంగనా రనౌత్ తెలుగు సినిమాలో నటించలేదు. కానీ ఈ సినిమా జెనెరేట్ చేసిన మ్యాజిక్ ఇప్పటికీ ఫ్యాన్స్ కి మెమోరబుల్ గానే ఉంటుంది.

పూజా హెగ్డే : ప్రభాస్ నెక్స్ట్ సినిమా హీరోయిన్. అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోను పక్కా ప్లానింగ్ తో కరియర్ ని బ్యాలన్స్ చేసుకుంటున్న ఈ బ్యూటీ, త్వరలో ప్రభాస్ సరసన మెరవనుంది.