టాలీవుడ్ యంగెస్ట్ డైరెక్టర్

Thursday,August 22,2019 - 10:02 by Z_CLU

సుజిత్… ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. తెలుగు సినిమా స్టాండర్డ్స్ దాటుతుంది. ఇలాంటప్పుడు ‘సాహో’ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ రావడం పెద్ద విషయం కాదు. కానీ… జస్ట్ 24 ఏళ్ల కుర్రాడు ఈ సినిమా తెరకెక్కించాడా..? అన్నదే ఇక్కడ పాయింట్.

సాధారణంగా 21 ఏళ్ళంటే అప్పుడపుడే సీనియర్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుతుంటారు. కానీ సుజిత్ ఎంట్రీనే వేరు. చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ UV క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ దృష్టిలో పడ్డాడు. అలా 21 ఏళ్లకే మొదటి సినిమాకు దర్శకత్వం వహించాడు.

నిజానికి ‘రన్ రాజా రన్’ సినిమా నాటికి సుజిత్ కటౌట్ కి శర్వానంద్ అవకాశం ఇవ్వడం కూడా గొప్పే. కాకపోతే శర్వా సీన్లోకి ఎంటర్ అవ్వకముందే ప్రొడ్యూసర్స్ తో పాటు ప్రభాస్ కి కథ చెప్పి.. లైన్ క్లియర్ చేసుకున్నాడు సుజిత్. 

చూస్తే చాక్లెట్ బాయ్ లా ఉంటాడు…. ఏకంగా 350 కోట్ల సినిమాకి స్కెచ్ వేశాడు. ‘బాహుబలి’ లాంటి మ్యాగ్నమ్ ఓపస్ తరవాత ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్న ప్రభాస్ తో సినిమా చేశాడు. ‘సాహో’ కన్నా గొప్ప సినిమాలు ఇక టాలీవుడ్ లో రావని కాదు కానీ, ఇంత యంగెస్ట్ డైరెక్టర్స్ మాత్రం ఇంత భారీ సినిమాలతో రాకపోవచ్చు. అందుకే సుజీత్ ఇప్పుడు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు.