‘సాహో’ లో సస్పెన్స్ ఎలిమెంట్స్

Wednesday,August 28,2019 - 10:02 by Z_CLU

కళ్ళు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ వైపు… మేకర్స్ లో కనిపిస్తున్న నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఇంకో వైపు… ఫ్యాన్స్ లో గంట గంటకి ఈ సినిమా చుట్టూ క్యూరియాసిటీ పెరుగుతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్.. బాలీవుడ్ టాప్ మోస్ట్ ఆర్టిస్టులు… అన్నింటికీ మించి రెండేళ్ల నిరీక్షణ తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ ని మరింత పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ మధ్య ప్రెజెంట్ చేయబోతున్న ‘సాహో’… ఎలా ఉండబోతుంది..? ఈ సినిమా చూస్తే కానీ తెలీదు అనిపించే స్థాయిలో ఫ్యాన్స్ లో క్రియేట్ అయి ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏంటి..?

రెబల్ స్టార్ ఆన్ మిషన్ : 2000 కోట్ల రాబరీ… ఇంపార్టెంట్ లాకర్… అది ఓపెన్ చేయడానికి కావాల్సింది ఓ బ్లాక్ బాక్స్… వీటి చుట్టూ మోస్ట్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్స్… ట్రైలర్ చెప్పిన కథ ఇదే. అయితే నిజంగా ‘సాహో’ ఈ పాయింట్స్ చుట్టే తిరుగుతుందా..?  అస్సలు కాదు… ఈ పాయింట్స్ జస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే… అసలు బొమ్మ పడేది థియేటర్స్ లోనే…

లవ్ యాంగిల్ : సాహోలో ఇది కూడా ఓ సస్పెన్స్ ఎలిమెంట్. యాక్షన్ సబ్జెక్ట్ గా వస్తున్న సాహోలో లవ్ ట్రాక్ కావాలని పెట్టలేదు. అది సినిమాకు చాలా కీలకం అంటోంది యూనిట్. ఏంటా సస్పెన్స్? దీనికితోడు శ్రద్ధాకపూర్.. ప్రభాస్ కి రివాల్వర్ ఎందుకు గురి పెట్టాల్సి వచ్చింది…?

అసలు సంగతేంటి..? : ‘సాహో’ ట్రైలర్ ఎన్ని సార్లు చూసినా… ఆన్సర్ దొరకని క్వశ్చన్… ‘ఇంతకీ ప్రభాస్ డ్యూయల్ రోలా…? సోలో క్యారెక్టరా..?’ ఈ 2 ఆప్షన్స్ లో ఏది ఎంచుకున్నా… ఇంకో క్వశ్చన్ టీజ్ చేసినట్టే అనిపిస్తుంది. ఆన్సర్ అఫీషియల్ గా రివీల్ అయ్యేది శుక్రవారమే…. వెయిట్ చేయాల్సిందే…

 

పాయింటే కదా : బాహుబలి లాంటి సినిమా తరవాత సుజిత్ కథ చెప్తే నో అని చెప్పలేకపోయాడు ప్రభాస్. అదే నిజం… అంతగా రెబల్ స్టార్ ని ఎట్రాక్ట్ చేసిన హై వోల్టేజ్ పాయింట్ ఏంటి..?

ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ : రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ దగ్గర పడింది అన్న టైమ్ లో ‘సాహో’ లో ఫాదర్ సెంటిమెంట్ ఉండబోతుంది అనే టాక్ బయటికి వచ్చింది. నిజమా..? అండర్ కవర్ ఆఫీసర్ గా సీన్ లోకి వచ్చే హీరో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? సాహో నిజంగానే యాక్షన్ ఎంటర్ టైనరా..? లేక ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయా?