టైటిల్స్ Vs సక్సెస్

Thursday,August 15,2019 - 11:02 by Z_CLU

‘మన్మధుడు 2’ సినిమాకి ఇంకో టైటిల్ పెడితే బావుండేదా…? నాగార్జున రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమా చేసినా, తన గత సినిమాలతో కంపారిజన్స్ జరగలేదు. కానీ ‘మన్మధుడు 2’ కి తప్పలేదు. ఎందుకంటే టైటిలే రీజన్. మన్మధుడు కన్నా గొప్పగా ఉంటుందేమో… అట్లీస్ట్ ఆ స్థాయి ఫీల్ ఉంటుందన్న యాంగిల్ లో ఎక్స్ పెక్ట్ చేశారు ఆడియెన్స్. సినిమా బావున్నా.. ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ వేరు.. సినిమా వేరు… గతంలో కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డ సినిమాలకు కూడా రీజన్ టైటిల్సే.

కిక్ 2 : రవితేజ కిక్ సినిమా సూపర్ హిట్. కానీ ‘కిక్ 2’ అంటూ వచ్చిన ఈ సినిమా సీక్వెల్ కంప్లీట్ గా డిజప్పాయింట్ చేసింది.

రాజుగారి గది 2 : ఏ మాత్రం స్టార్ వ్యాల్యూ లేకుండా తెరకెక్కి ‘రాజుగారి గది’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ‘రాజుగారి గది 2’ , సమంతా లాంటి స్టార్ వ్యాల్యూ కలిసొచ్చినా, ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది.

ప్రేమకథా చిత్రమ్ 2 : ఈ సినిమాతో హారర్ కామెడీ అనే ఓ కొత్త ట్రెండ్ నే క్రియేట్ చేశాడు దర్శకుడు మారుతి. మళ్ళీ ఇదే టైటిల్ తో రిలీజైన ‘ప్రేమకథా చిత్రమ్ 2’ అట్టర్ ఫ్లాప్.

వీటికి తోడు ఈ వరసలో వస్తున్న ‘బంగార్రాజు’, రియల్ సీక్వెల్స్    అయిన గూఢచారి 2, కార్తికేయ 2… ఎలా నిలబడతాయో చూడాలి. ఈ సినిమాలకైనా బ్లా బస్టర్ టైటిల్స్ కలిసొస్తాయా..? గతంలోలా ఆడియెన్స్ అంచనాలు ఓ వైపు.. అసలు కథ ఇంకో వైపు అనిపించుకుంటాయా..? చూడాలి.