జపాన్ లో రికార్డు సృష్టించిన ప్రభాస్

Thursday,July 23,2020 - 01:33 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్ లో రికార్డు సృష్టించాడు. అతడు నటించిన లేటెస్ట్ మూవీ సాహో.. జపాన్ లో కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది.

జ‌పాన్‌లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డంతో థియేటర్లు తెరుచుకున్నాయి. అక్క‌డ రిలీజైన ఒకే ఒక్క నాన్-జపనీస్ మూవీ సాహో. ఇప్పుడీ సినిమాకు జపాన్ ప్రేక్షకులు వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌పాన్ థియేటర్లలో అత్య‌ధిక ఓపెనింగ్‌ క‌లెక్ష‌న్ వ‌చ్చిన మొదటి ఇండియన్ మూవీగా సాహో రికార్డు సృష్టించింది. మొన్నటివరకు ఈ రికార్డ్ దంగల్ సినిమా పేరిట ఉండేది. అమీర్ ఖాన్ నటించిన ఆ సినిమా రికార్డును ప్రభాస్ క్రాస్ చేశాడు.

నిజానికి జనవరిలోనే సాహో జపనీస్ డబ్బింగ్ వెర్షన్ రిలీజైంది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. తాజాగా థియేటర్లు తెరుచుకోవడం, సాహో చూడ్డానికి జపాన్ ప్రజలు క్యూ కట్టడం చకచకా జరిగిపోయాయి.