వెంకీమామతో స్పెషల్ చిట్ చాట్

Thursday,January 16,2020 - 03:53 by Z_CLU

‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సక్సెస్ మూడ్ లో ఉంది. సంక్రాంతి పండక్కి మరిన్ని కలర్స్ ని తెచ్చి పెట్టింది ఈ సినిమా. అయితే ఈ సంబరాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో మహేష్ బాబుతో కలిసి పంచుకున్నాడు విక్టరీ వెంకటేష్. సరదాగా సినిమా కబుర్లని అడిగి తెలుసుకున్నాడు. దాంతో పాటు అలవాటు ప్రకారం అనిల్ రావిపూడి అడిగిన క్వశ్చన్స్ కి సరదా సమాధానాలు చెప్పాడు.

‘ఆ సినిమా వెంకీ కన్నా ముందు చూసింది నేనే…’

ఈ మాట చెప్పింది ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. అలాగని అదేదో రీసెంట్ గా రిలీజైన వెంకీ సినిమా కాదు. హీరోగా పరిచయమైన ‘కలియుగ పాండవులు’ సినిమా. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి వాళ్ళ ప్రివ్యూ థియేటర్ లో చూశాడట మహేష్ బాబు. ఆ అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇక ‘సరిలేరు…’ వచ్చేసరికి తన కరియర్ లోనే మాస్ నంబర్ ‘మైండ్ బ్లాక్’ వేసిన మహేష్ బాబు, ఆడియెన్స్ లో ఇలాంటి రియాక్షన్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ చూశాను అని చెప్పుకున్నాడు.

F2’ నాకు ఆ క్లారిటీ ఇచ్చింది…

‘F2’ కి ముందు చాలా కథలు విన్న వెంకీ, ఇలాంటి కామెడీ డోస్ ఎక్కువగా ఉన్న సినిమా చేస్తానని కనీసం కలలో కూడా అనుకోలేదట. ఎప్పుడైతే అనిల్ రావిపూడి ఈ కథ చెప్పాడో, అప్పటికప్పుడే ఈ సినిమా చేశాకే ఇంకో సినిమా చేయాలి అనేంతగా ఫిక్స్ అయ్యాడట.

ఇద్దరిలో కామన్ గా కలిసొచ్చిన పాయింట్….

ఇకపోతే అనిల్ రావిపూడికి ఈ ఇద్దరు హీరోలతో కలిసి పని చేసినప్పుడు కలిసొచ్చిన పాయింట్ ఫుడ్. అతిగా తినేశాడంట అనిల్ రావిపూడి. వెంకీతో ఉన్నప్పుడు ఫారిన్ లోకేషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా తెగ తినేసిన ఈ దర్శకుడు, ‘సరిలేరు నీకెవ్వరు..’ సెట్స్ పై కూడా అంతే పుష్టిగా తినేశాడట.