మినిమం బ్రేక్ కావాలంటున్న మహేష్ బాబు

Saturday,January 18,2020 - 12:02 by Z_CLU

లెక్క ప్రకారం ఓ సినిమా రిలీజ్ అయిన తరవాత ఓ వెకేషన్ ప్లాన్ ఆ తరవాత నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెడతాడు మహేష్ బాబు. కానీ ఈసారి అలా కాదు. ప్రస్తుతం ‘సరిలేరు..’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సూపర్ స్టార్, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా సినిమా చేసే ఆలోచనలో అస్సలు లేడు. మినిమం 3 నెలల బ్రేక్ తీసుకుంటున్నాడు.

త్వరలో అమెరికా బయలుదేరనున్న మహేష్ బాబు ఓ 2 నెలలు అక్కడే రిలాక్స్ అయ్యే ప్లానింగ్ లో ఉన్నాడు. ఆ తరవాతే వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తాడు. ఈ లెక్కన చూస్తే మహేష్ బాబు ఈ సినిమాని సమ్మర్ కల్లా చేద్దామని ఫిక్సయ్యాడనిపిస్తుంది.

వంశీ పైడిపల్లి ‘మహర్షి’ తరవాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. మహేష్ బాబు వెకేషన్ నుండి రిటర్న్ అయ్యేనాటికి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది ఈ సినిమా టీమ్.