నిజానికి మహేష్ బాబు అనుకున్నది వేరు...

Friday,January 10,2020 - 02:42 by Z_CLU

ఎవరితో ఫిక్సయ్యాడు అనేది మహేష్ బాబు రివీల్ అయితే చేయలేదు కానీ నిజానికి ‘మహర్షి’ తరవాత మహేష్ బాబు లైనప్ చేసుకున్న మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ కాదు. అనిల్ రావిపూడి మహేష్ బాబు కలిసి ఎప్పుడైతే 40 నిమిషాల కథ చెప్పాడో, అదే రోజు సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కానీ మహర్షి తరవాత ఈ సినిమా చేయాలని అప్పటికీ ఫిక్స్ అవ్వలేదు.

కానీ ఎప్పుడైతే ‘F2’ సినిమా చూశాడో, అనిల్ రావిపూడితో సినిమా చేశాకే నెక్స్ట్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. దానికో రీజన్ ఉంది. ‘దూకుడు’ లాంటి ఎంటర్టైన్ మెంట్ డోస్ ఎక్కువగా ఉన్న స్క్రిప్ట్ కోసం చూస్తున్న మహేష్ బాబు, అనిల్ రావిపూడితోనే మళ్ళీ ఆ మ్యాజిక్ పాసిబుల్ అవుతుందని నమ్మాడు. అందుకే ఇమ్మీడియట్ గా పిలిచి నెక్స్ట్ సినిమా మనదే అనేశాడు.

సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేయడం అనిల్ రావిపూడి బలం. అందుకే సూపర్ స్టార్ రేంజ్ కి తగ్గట్టుగానే యాక్షన్ ఏ మాత్రం స్కోప్ తగ్గని క్యారెక్టర్ రాసుకుని, దాని చుట్టూ హిలేరియస్ ఎలిమెంట్స్ ని ఎటాచ్ చేసుకున్నాడు. దాంతో ‘సరిలేరు…’ కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ లా తయారయింది. ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన వైబ్స్ చూస్తుంటే మహేష్ బాబు చెప్పినట్టు బొమ్మ దద్దరిల్లిపోతుందనిపిస్తుంది.