సూపర్ స్టార్ సినిమా ఈవెంట్ కి మెగాస్టార్

Friday,December 20,2019 - 06:49 by Z_CLU

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5 న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

అసలే ‘సరిలేరు నీకెవ్వరు’ చుట్టూ క్రియేట్ అయి ఉన్న హైప్, దానికి తోడు మహేష్ బాబు… ఇప్పుడు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి. అన్నీ కలిసి ఈ ఈవెంట్ పై సోషల్ మీడియాలో ఇప్పటి నుండే ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ బిగిన్ అయ్యాయి.

అంతేకాదు… ఈ ఈవెంట్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా హోస్ట్ చేయబోతున్నాడు. ఇలా మహేష్ బాబు తన కరియర్ లో ఎప్పుడూ చేయలేదు. చూడాలి ఈ ఈవెంట్ రోజు ఇంకెన్నెన్ని మ్యాజికల్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయో…