కీర్తిసురేష్ పై ‘మహానటి’ ఇంపాక్ట్

Saturday,June 15,2019 - 12:03 by Z_CLU

కీర్తిసురేష్ ఒక్కసారిగా బరువు తగ్గింది. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండటంతో ‘కీర్తి.. మరీ ఇంతగా తగ్గడం అవసరమా..?’ అని ఓ వైపు, ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ కోసం తగ్గి ఉంటుందా..? అనే క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. అయితే కీర్తి సురేష్ బరువు తగ్గడం వెనక అసలు విషయం వేరే ఉంది.

నిజానికి కీర్తికి స్పెషల్ గా బరువు తగ్గాలన్న ఆలోచనా లేదు… అవసరం లేదు… ‘మహానటి’ కన్నా ముందు. కానీ ఈ సినిమాలో కొన్ని సిచ్యువేషన్స్ కోసం పర్టికులర్ గా బరువు పెరగాల్సి వచ్చింది. దాంతో కొన్నాళ్ళ పాటు కీర్తి బొద్దుగా కనిపించేసరికి ఫ్యాన్స్ కూడా అలాగే అలవాటు పడిపోయారు.

కానీ ఈ సినిమా తర్వాత కీర్తి కాస్త మెల్లగానే బరువు తగ్గడం పై కాన్సంట్రేట్ చేసింది. దాంతో బొద్దుగా.. కంటికి  నిండుగా కనిపించిన కీర్తి సురేష్, సడెన్ గా జీరో సైజ్ లో కనిపించేసరికి హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఏడాది బాలీవుడ్ లో కూడా డెబ్యూ ఇవ్వనుంది కీర్తి సురేష్. అక్కడ కూడా జీరో సైజ్ కే డిమాండ్ కాబట్టి, అన్ని రకాలుగా కలిసొస్తుందనుకుంటున్నది కీర్తి సురేష్. ఇలా కూడా చూడ్డానికి చాలా బావుంది మరీ…